ప్రపంచం నిండా పురుషాధిక్యం ఉంది. ఇది కాదనలేని వాస్తవం. దేవుడు కూడా మగాడు కావడంతో మగవారిని బలవంతులుగా, ఆడవారిని బలహీనులుగా మార్చాడని అంటారు. అది కేవలం శారీరకం గానే సుమా..! మానసికంగా మహిళలు మగవారి కంటే బలస్తులు, ఎంతో తెలివి, క్రియేటివిటీ, సున్నిశిత పరిశీలన, ఓర్పు ఉన్నవారు. ఇక నేటి మహిళల్లో, మహిళా మేధావులు స్వేచ్చ అంటే ఏదో తెలియని ముడి పదార్ధంగా అర్ధాలు తీస్తున్నారు. మగాళ్లలాగా విశృంఖలంగా ప్రవర్తించి అదే స్వేచ్చ అనుకుంటే తప్పే. స్వేచ్చ అనేది మనసుకి సంబంధించిన విషయం. ఇక నేటి రోజుల్లో మీడియా మీద, చానెల్స్ మీద పలు విమర్శలు వస్తున్నాయి. భ్రష్టుపట్టిపోయిన రంగాలలో మీడియా కూడా ఒకటని అందరూ ఒప్పుకుంటారు. మరి వారు చేసే చర్చలకి, అనవసర రచ్చలకి ఆ విధంగా టీఆర్పీలు వస్తున్నాయంటే వాటిని ప్రేక్షకులు ఏ స్థాయిలో ఇష్టపడి చూస్తున్నారో అర్ధమవుతోంది.
మరికొందరు మహిళా సంఘాల నేతలు టీవీలలో తాము కనిపించాలనో, లేక తమకు గుర్తింపు రావాలనో టీవీలు నిర్వహించే ప్రతి అడ్డమైన షోకి వచ్చి మాట్లాడుతున్నారు. వీరి మాటల వల్ల వివాదాలు కోరుకునే వారి ఆశ ఈ మహిళాసంఘాల వల్ల నెరవేరుతుండటం, తమ చానెల్స్ వీక్షకులను పెంచేందుకు మహిళలను రచ్చలకు పిలిచి మరింత రచ్చ చేయడం పరిపాటిగా మారింది. అదే టీవీ చానెల్స్ వేసే చెత్త కార్యక్రమాలు, షోలకి ఆదరణ తగ్గితే ఆటోమేటిగ్గా వాటి వైపు చూడటం టీవీ నిర్వాహకులు మానివేస్తారు. వర్మ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' పై చర్చ చూసిన వారికి పోర్న్ గురించి తెలియకపోయినా దానిని చూడాలంటే ఆసక్తి మొదలైందంటే అది వీరందరి పుణ్యమే.
ఒకవైపు స్వేచ్చగా తమకిష్టం వచ్చినట్లు, తమకిష్టమైన దుస్తులు వేసుకుంటాం.. సెక్స్‌లో కూడా స్వేచ్చ కావాలి అని వాదించే కొందరు మరోపక్క మీడియాలో, సినిమాలలో వచ్చే శృంగారం, మహిళల వేషధారణపై కామెంట్స్ చేస్తుంటారు. వర్మ జీఎస్టీ, పవన్- కత్తిమహేష్ ఎపిసోడ్, కల్వకుర్తి సిఐ మల్లికార్జున్‌రెడ్డి, ఎఎస్పీ సునీతా రెడ్డిల మధ్య వివాహేతర సంబంధం వంటివి సమాజానికి ఏ మేలు చేయవని, చానెల్స్‌తోపాటు వాటిని చూసే వారు.. వాటిల్లో పాల్గొని ప్రసంగించేవారు అందరూ తెలుసుకోవాలి.