గతేడాది దిల్‌రాజు-హరీష్‌శంకర్- అల్లుఅర్జున్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'డిజె' (దువ్వాడ జగన్నాధం)కి మిక్స్‌డ్ టాక్, కొత్తదనం లేదని సామాన్య ప్రేక్షకుడి పెదవి విరుపు, మిక్స్‌డ్ రివ్యూలతో చాలా గందరగోళం ఏర్పడింది. ఓ వైపున దిల్‌రాజు, హరీష్ శంకర్, బన్నీలు ఈ చిత్రం పెద్ద హిట్ అని అంటే మీడియా నై అనేసింది. దీంతో నిజంగా ఈ చిత్రం హిట్టా? ఫట్టా? అనే విషయంలో ఈ చిత్రం యూనిట్‌కే కాదు.. ప్రేక్షకులకు, ట్రేడ్ నిపుణులకు కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. బన్నీకి మలయాళంలో ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే.
ఇక 'డిజె' మ్యాజిక్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో యూట్యూబ్ లో కూడా రిపీట్ అవుతోంది. అల్లుఅర్జున్ నటించిన 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం 50 మిలియన్ వ్యూస్‌ని సాధించింది. ఇక 'సరైనోడు' చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో ప్రసారమైన 171 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్‌ని సాధించింది. ఇక ఈ చిత్రం ఓవరాల్‌గా 125 మిలియన్ వ్యూస్‌తో ఇప్పటికీ ముందంజలోనే ఉంది. మరోవైపు 'డిజె' చిత్రం యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన 71 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్‌ని సాధించడం చూస్తే బన్నీకి క్రమంగా బాలీవుడ్‌లో కూడా క్రేజ్ ఏర్పడుతున్న సంగతి అర్ధమవుతోంది. ఈయన చిత్రాల డిజిటల్ రైట్స్ బారీ రేట్లు పలుకుతున్నాయి.
ఇక 'డిజె'కి శాటిలైట్‌లో ప్రసారమైనప్పుడు కూడా మంచి టీఆర్పీ రేటింగ్‌లే వచ్చాయి. దాంతో బన్నీ ప్రస్తుతం తాను చేసే 'నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా' చిత్రం ఉత్తరాది వారికి బాగా నచ్చే దేశభక్తి కంటెంట్ ఉన్న చిత్రం కావడం, హిందీలో బన్నీకి ఏర్పడుతున్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో కూడా డబ్ చేసి తెలుగుతోపాటు ఏడు భాషల్లో ఒకేరోజున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.