ధైర్యే సాహసే లక్ష్మి అంటారు. దైర్యం చేస్తేనే డబ్బు, ఖ్యాతి వస్తాయి. మనకున్నది చాలులే అనుకుంటే నూతిలో కప్పలా ఉండిపోతాం. ఇక నేడు సినిమాలలోకి వచ్చేవారు ఎప్పుడు క్లిక్ అవుతామో తెలియదు కాబట్టి మరోసైడ్ బిజినెస్‌ని కూడా చూసుకుని ముందు జాగ్రత్తగా ఇండస్ట్రీకి వస్తున్నారు. ఇక పరుచూరి గోపాలకృష్ణ విషయానికి వస్తే ఆయన పేరుని తన సోదరుడితో కలిపి పరుచూరి బ్రదర్స్‌గా మార్చింది ఎన్టీఆర్ అయితే ఆయనకు ఎక్కువ చిత్రాలకు చాన్స్‌లు ఇచ్చింది సూపర్‌స్టార్‌కృష్ణ.
ఇక పరుచూరి గోపాలకృష్ణ తాను చేసిన థీసిస్‌లో భాగంగా ఉద్యోగానికి ఏడాది లీవ్ పెట్టాడు. ఆయన జీతం 1100రూపాయలు. భార్య పేరు మీద రెండెకరాల పొలం అయితే ఉంది గానీ దానిపై పెద్ద ఆదాయం లేదు. ఇక మద్రాస్ వస్తే స్టార్‌వి అవుతావని దర్శకుడు పి.సి.రెడ్డి పరుచూరికి చెప్పారు. దాంతో థీసిస్‌తో పాటు ఎలాగూ ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టాను కాబట్టి మద్రాస్ వెళ్లి స్థిరపడి ప్రయత్నాలు చేయాలని పరుచూరి భావించారు. కానీ ఆయన శ్రీమతి.. మద్రాస్ వెళ్తున్నారు. వెళ్లేటప్పుడు నా నగలు కుదవపెట్టిన డబ్బులు ఖర్చు చేసుకురావడం తప్ప పదిపైసలు తేలేరు. పాపకి ఏవో గౌన్లు తెస్తారు. సినిమా ఇండస్ట్రీలో ఏడాది చాన్స్ రాకపోతే మన కుటుంబం గడిచేది ఎలా అని ప్రశ్నించింది.
దాంతో ఈయన 1981 అక్టోబర్ 21న నవంబర్ 1 మన పాప పుట్టినరోజు. ఆ రోజు మద్రాస్ వెళ్లతాను. డిసెంబర్ 1 నాటికి నా ఖర్చులన్నీ పోను 1100రూపాయలు సంపాదించలేకపోతే ఉద్యోగంలో చేరిపోతాను అని చెప్పి మరి తనని తాను నిరూపించుకున్నారు పరుచూరి గోపాలకృష్ణ.