Advertisementt

సమంత.. రాజకీయాల్లోకా..??

Thu 01st Feb 2018 12:00 AM
samantha,politics,akkineni family,ktr,trs,political entry  సమంత.. రాజకీయాల్లోకా..??
Samantha's political entry on cards సమంత.. రాజకీయాల్లోకా..??
Advertisement

సమంత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఇప్పటివరకు టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది. టాప్ స్టార్స్ అందరితోనూ జోడి కట్టిన ఈ భామ సమంత రూతు ప్రభు నుండి సమంత అక్కినేనిగా మారిపోయింది. కో స్టార్ నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత అక్కినేని ఇంటికోడలిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుంది. నాగ చైతన్యకి భార్యగా, నాగార్జునకు కోడలిగా ఒక వెలుగు వెలుగుతూనే సినిమాల్లోనూ టాప్ పొజిషన్ ని అనుభవిస్తుంది. అంతేకాకుండా తెలంగాణ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం నుండి ప్రశంసలు అందుకుంటుంది. అలాగే తెలంగాణ ఐటి శాఖామంత్రి కేటీఆర్ సమంతకి చేనేత వస్త్రాల పబ్లిసిటీకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఇప్పుడు సడన్ గా సమంత రాజకీయాల్లోకి వస్తుందని... అలాగే సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి సమంత పోటీ చేయబోతుందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అది కూడా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తరుపు నుంచి సమంత పోటీ చేయనుందని న్యూస్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అక్కినేని కుటుంబంతో కేసీఆర్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ సాన్నిహిత్యంతోనే సమంతను తెలంగాణలో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారని టాక్ ఉండనే ఉంది.

అందులో భాగంగానే సమంతని ఇలా రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు కేటీఆర్ ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా వార్తలొస్తున్నాయి. సమంతని  క్రిస్టియన్స్ జనాభా గట్టిగా ఉన్న సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి పోటీ చేయిస్తే అటు సినీ స్టార్ ఇమేజ్, సీమాంధ్ర ఓటర్ల ప్రభావం, క్రిస్టియన్ ఓట్స్ ప్రభావం.. మూడూ తమ వైపుకే మళ్లుతాయని.. అక్కినేని సినీ ఇమేజ్ ను కూడా తమ పార్టీ వైపుకు మళ్లించుకోవచ్చనేది కేటీఆర్ ప్లాన్ గా చెబుతున్నారు. మరి ప్రస్తుతం తెలుగు, తమిళంలో ఫుల్ ఫామ్ లో ఉన్న సమంత ఇలా రాజకీయాల్లోకి వచ్చి కెరీర్ నాశనం చేసుకుంటుంది అంటే నమ్మే విషయం కాదు. మరి సమంత రాజకీయాల్లోకి రావడం అనేది మాత్రం ఖచ్చితంగా రూమర్ అని కొట్టిపారేస్తున్నారు సామ్ అభిమానులు.

Samantha's political entry on cards:

Samantha to contest next elections

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement