Advertisementt

పవన్ గుండుపై మరోసారి క్లారిటీ..!

Mon 29th Jan 2018 10:32 PM
pawan kalyan,visit,paritala ravi,house,paritala sunitha,clarifies,pawan,gundu  పవన్ గుండుపై మరోసారి క్లారిటీ..!
Pawan Kalyan Visit Paritala Ravi House పవన్ గుండుపై మరోసారి క్లారిటీ..!
Advertisement
Ads by CJ

ఏదో ఇష్యూ వల్ల పవన్ కళ్యాణ్ కి పరిటాల రవి గుండు కొట్టించాడని అప్పట్లో ప్రచారం జరిగింది. ఏదో వ్యవహారంలో పరిటాల రవికి పవన్ కళ్యాణ్ కోపం తెప్పించాడని అందుకే తన అనుచరులు పవన్ ను ఎత్తుకెళ్లారని, చితకొట్టి...పరిటాల రవి గుండు గీయించాడని వార్తలు వచ్చాయి. ఇది జరిగి దాదాపు దశాబ్దంన్నర అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ టాపిక్ తెర మీదకు వచ్చింది.

ప్రస్తుతం పొలిటికల్ పేరుతో బిజీగా వున్న పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూ పై స్పందించాడు. అసలు పరిటాల రవితో నాకు సంబంధం లేదని... నేను ఎప్పుడు ఆయన్ని కలవలేదని.. పరిటాల రవి నాకు గుండు గీయించిన వార్తలు ఉట్టి అబద్ధమని పవన్ స్పష్టం చేశాడు. అంతేకాదు అప్పుడు ఆ తప్పుడు ప్రచారం తెలుగుదేశం ఆఫీస్ నుండే జరిగిందని... అంత చేసినా తను తెలుగుదేశం పార్టీ కోసమే పని చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు.

మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంతటితో ఆగలేదు.. డైరెక్టుగా పరిటాల సునీత ఇంటికి వెళ్లాడు. అనంతపురంలోని ఆమె ఇంటికి వెళ్లి ఆదివారం ఉదయం టిఫిన్ చేశాడట పవన్ కళ్యాణ్. మరి ఈ చర్యలతో పరిటాల కుటుంబంపై తనకు ఎలాంటి కోపం లేదని పవన్ క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది.

Pawan Kalyan Visit Paritala Ravi House:

Paritala Sunitha Clarifies on Pawan Kalyan Gundu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ