'రేసుగుర్రం, దృవ' చిత్రాలతో మెగా కాంపౌండ్‌కి ఎంతో సన్నిహితమున్న దర్శకునిగా సురేందర్‌రెడ్డి మారాడు. చిరంజీవి చేస్తున్న 151వ చిత్రం 'సై..రా..నరసింహారెడ్డి' కోసం అహర్నిశలు కష్టపడుతోంది. వచ్చే నెల నుంచి రెండో షెడ్యూల్‌ని ప్రారంభించడానికి కసరత్తులు మొదలయ్యాయి. ఇక ఈ చిత్రం సబ్జెక్ట్ విషయంలో సీనియర్ రచయితలు పరుచూరి బ్రదర్స్ నుంచి సత్యానంద్ వరకు పాలు పంచుకుంటున్నారు. ఇక సురేందర్‌రెడ్డి కూడా ఇదే చిత్రం లోకంగా బతికేస్తున్నాడు.
ఇక 'సైరా'.. కోసం మెగాస్టార్ లుక్ దాదాపు ఫైనల్ అయిపోయింది. ఈ గెటప్‌లో తాను కనిపించాలని దర్శకుడు సురేందర్‌రెడ్డి-దీపారెడ్డిల ముద్దుల కుమారుడు ఆరిక్‌రెడ్డి నానా గోల చేయడంతో సురేందర్‌రెడ్డి తన కాస్ట్యూమర్స్‌కి చెప్పి మరీ తన కుమారుడు ఆరిక్ రెడ్డికి సైరా గెటప్‌తో కాస్ట్యూమ్స్‌ని కుట్టించి వేసి సరదా తీర్చుకున్నాడు. ఈ బుల్లి సైరా గెటప్‌లో ఈ బుడతడు అదరగొడుతున్నాడు. గతంలో రామ్‌చరణ్ గుర్రం ఎక్కి స్వారీ చేసిన ఈ బుడ్డాడు ఇప్పుడు సైరా గెటప్‌లో చూపిస్తున్న స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఎంతైనా కోరుకోవాలే గానీ కొండ మీద కోతినైనా తెచ్చి ఇచ్చే కుటుంబంలో సైరా డ్రస్ గెటప్‌లు ఏమి ఖర్మ . పెద్దయిన తర్వాత తానే హీరోగా నటిస్తానని చెప్పినా సురేందర్‌రెడ్డి దానికి కాదనకపోవచ్చు అని ఈ పిక్స్‌లో తన కుమారుడిని చూసి మురిసిపోతున్న సురేందర్‌రెడ్డిని చూస్తేనే అర్ధమైపోతుంది.