తెలుగులో అతి చిన్న వయసులోనే సంగీత దర్శకునిగా తన కెరీర్‌ని స్టార్ట్ చేసి స్టార్ సంగీత దర్శకునిగా పేరు తెచ్చుకున్న సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్. ఈయన కేవలం సంగీత దర్శకుడు కాదు.. రాక్‌స్టార్‌గా తన స్టెప్పులతో పాటలు పాడుతూ కూడా సంగీతాభిమానులను ఉర్రూతలూగిస్తాడు. ఈయన హవా కేవలం తెలుగులోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్‌లలో కూడా ఉంది. ఇక ఈయన సంగీతం, పాటలు పాడే విధానం స్టేజీ మీద ఆయన చూపే ఎనర్జీని చూస్తే ఎలాంటి వారికైనా కిక్ వస్తుంది. ఈయనకు గతంలో హీరోయిన్ చార్మితో ఎఫైర్ ఉండేదని కూడా పలు వార్తలు షికారు చేశాయి.
ఇక దిల్‌రాజు నిర్మాతగా ఈయన హీరోగా పరిచయం కానున్నాడని కూడా పలు వార్తలు వచ్చాయి. ఇక విషయానికి వస్తే కిందటి ఏడాది ఈయన వరుసగా ఎనిమిది బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతం అందించాడు. 'ఖైదీనెంబర్ 150, నేను లోకల్, రారండోయ్ వేడుకచూద్దాం, జయ జానకి నాయకా, ఎంసీఏ, దువ్వాడ జగన్నాధమ్, జై లవకుశ, ఉన్నది ఒకటే జిందగీ' వంటి చిత్రాలన్నీ మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయ్యాయి. ఇక తాజాగా ఆయనను మీ పెళ్లెప్పుడు అని ప్రశిస్తే, దానికి సమాధానంగా ఏం నేను సంతోషంగా ఉండటం మీకు ఇష్టం లేదా..? అంటూ చమత్కరించడంతో అందరూ ఒక్కసారిగా నవ్వాపుకోలేకపోయారు.
ఇక ప్రస్తుతం తాను 'భరత్ అనే నేను' తో పాటు రామ్‌చరణ్-బోయపాటి శ్రీనుల దర్శకత్వంలో రూపొందే చిత్రం, మహేష్‌బాబు హీరోగా దిల్‌రాజు-అశ్వనీదత్‌లు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మించే మహేష్ 25వ ప్రతిష్టాత్మక చిత్రాలకు కూడా దేవిశ్రీనే సంగీతం అందిస్తుండటం విశేషంగా చెప్పాలి.