పవన్ అనంతపురం నుంచి తన యాత్రను మొదలుపెట్టి రాయలసీమలోని పలు సమస్యలు ఉన్న ప్రాంతాలల్లో పర్యటిస్తానని, వ్యక్తిగతంగా ఆ ప్రాంతాలలో పర్యటించి సమస్యలను గురించి తెలుసుకుని తర్వాత మేధావులతో చర్చించి వాటి పరిష్కారాలను గుర్తించి చంద్రబాబునాయుడు, కేసీఆర్ వంటి ముఖ్యమంత్రుల వద్దకు ఆ సమస్యల పరిష్కారం కోసం వెళతానని చెప్పాడు. తనవి కేవలం వచ్చే ఎన్నికల కోసం చేస్తున్న పర్యటనలు కాదని, 25ఏళ్ల పాటు సాగే ఉద్యమాలని ఆయన తెలియజేశాడు.
రాయలసీమ అంటే అందరికీ ఫ్యాక్షనిజం కనిపిస్తుందని కానీ తనకు తరిమెల నాగిరెడ్డి, నీలం సంజీవరెడ్డి వంటి మానవత్వం ఉన్న మనుషులు కనిపిస్తారని ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. మీతో చప్పట్లు కొట్టించుకోవడం కోసం ఇలా చెప్పడం లేదు. తుదిశ్వాస వరకు రాయలసీమకి అండగా ఉంటానని చెప్పారు. ఇక అనంతపురంలోని గుత్తిరోడ్డు వద్ద జనసేన కార్యాలయానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాల్లో పవన్ పాల్గొన్నారు. రాయలసీమలో ఎలాంటి సమస్యలు ఉన్నా గుర్తించి, వాటి పరిష్కారం దిశగా పనిచేయడమే తన కర్తవ్యమని పవన్ చెప్పుకొచ్చారు. రైతుల కష్టాలు, యువత ఆశయాలు నాకు తెలుసు. నేను యువత భవిష్యత్తు కోసమే ముందుకు వచ్చాను.
కుల, మత ప్రాంతీయ రాజకీయాలు నేను చేయను. 2019లో యువత ఏమి చేయబోతోంది.? ఎలాంటి మార్పును కోరుకుంటోంది అనేది తెలిసి వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి యువతకు ప్రతినిధిగా పవన్ చేస్తున్న యాత్రల పట్ల యువతలో సానుకూలాభిప్రాయమే ఏర్పడుతోంది.