Advertisementt

బాలయ్య హ్యాపీగా లేడంట..!

Mon 29th Jan 2018 01:50 PM
balakrishna,not satisfied,teja direction,ntr biopic  బాలయ్య హ్యాపీగా లేడంట..!
Balayya Not Happy with Teja Direction బాలయ్య హ్యాపీగా లేడంట..!
Advertisement
Ads by CJ

కెరీర్ లో 100 చిత్రాల మైలురాయి అరుదైన ఘనతగా భావించే నేటి తరంలో మెగాస్టార్ చిరంజీవి తరువాత ఆ సంఖ్య దాటిన హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ. ఈ 100 వ చిత్రం నుంచే తన కథల ఎంపికలో వైవిధ్యం తప్పక కనపడుతుందని మాట ఇచ్చిన బాలయ్య 100 వ చిత్రం చారిత్రాత్మక కథని, తరువాత 101 మరియు 102 చిత్రాలలో ఇప్పటి వరకు చేయని తరహా మాస్ పాత్ర మరియు సెంటిమెంట్ పండించే పాత్రలో మెప్పించిన బాలయ్య 103 వ చిత్రంగా తన తండ్రి సర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ కి సిద్దమైన సంగతి విదితమే.

ముందుగా ప్రకటించిన ప్రణాళిక ప్రకారం రామారావు వర్ధంతి నాడు ఈ చిత్ర టీజర్ విడుదల కావలసి ఉన్నప్పటికీ దర్శకుడు తేజ కట్ చేసిన టీజర్, దానికి వాడిన లైటింగ్ ఎఫెక్ట్స్ మరియు మేకింగ్ వ్యాల్యూస్ బాలయ్యని తృప్తి పరచలేకపోయాయని టాక్. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ఏ చిన్న విషయంలోనూ రాజీ పడటం ఇష్టం లేని బాలయ్య టీజర్ విడుదల ప్లాన్ నిలిపి వేశారట. ప్రస్తుతం తేజ విక్టరీ వెంకటేష్ చిత్రంతో బిజీ అవుతుండటంతో ఆయన పనితనంపై అసంతృప్తితో ఉన్న బాలయ్య ఈ గ్యాప్ లో మరో దర్శకుడికి ఎన్.టి.ఆర్  బయోపిక్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా వున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Balayya Not Happy with Teja Direction:

Balakrishna Not Satisfied with Teja Work on NTR Biopic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ