ఎప్పుడో విడుదలవ్వాల్సిన 'పద్మావత్' చిత్రం ఎన్నో అడ్డంకులు దాటుకుని ఎట్టకేలకు ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ మెయిన్ లీడ్స్ లో నటించిన ఈ సినిమా ఎన్ని సమస్యలు ఎదుర్కొందో అంత పెద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా మొదటి రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు ఈ సినిమా మీద భీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. కానీ విడుదల తేదీ ఆగడం... సమస్యలు ఎక్కువ కావడంతో చాలా లేట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజు వసూళ్ల విషయంలో మాత్రం చాలానే వెనుకపడి పోయింది.
ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన.... ఇండియాలో నాలుగు రాష్ట్రాల్లో పద్మావత్ చిత్రం విడుదల కాకపోవడంతో పద్మావత్ చిత్రం తొలిరోజు వసూళ్లు పడిపోవడానికి కారణమయ్యాయి. అయితే తొలిరోజు వసూళ్లు ఎలా ఉన్నా రెండోరోజు మాత్రం పద్మావత్ వసూళ్లు పుంజుకుని బాక్సాఫీసుని దడ దడ లాడించేసింది. అయితే ఈ వీకెండ్ కూడా పద్మావత్ వసూళ్లు ఇంకా పెరుగుతాయని.. కారణం పద్మావత్ కి మౌత్ టాక్ సూపర్ గా ఉందని అంటున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ను ఇప్పుడప్పుడే అంచనా వేయడం చాలా కష్టమైన విషయమే అంటున్నారు. ఎన్నో ఒడిదుకులతో... ఏ మాత్రం ప్రచారం లేకుండానే విడుదల అయిన ఈ సినిమా.. వీకెండ్ ముగిసేలోగానే ఇండియాలోనే 100 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో దీపికా నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఈ సినిమాలో నటించిన షాహిద్, రణ్వీర్ ల నటన కూడా ఈ సినిమాకే హైలెట్ అంటున్నారు.