తాజాగా విడుదలైన రామ్‌చరణ్-సుకుమార్‌ల 'రంగస్థలం 1985' టీజర్ మొత్తం హీరో పాత్రధారి అయిన రామ్‌చరణ్ అలియాస్ చిట్టిబాబు చుట్టూనే తిరిగింది. 'జైలవకుశ'లో ఎన్టీఆర్ నత్తిని, 'రాజా ది గ్రేట్'లో రవితేజ అంధునిగా నటించినా కూడా వాటిని పెద్దగా హైలైట్ చేయకుండా మామూలు మాస్ కథలలాగే వాటిని తీర్చిదిద్దారు. కానీ సుకుమార్ అలా కాదు. ఆయన చిత్రాలలో పాత్రలకి తగ్గట్లుగా కథలను వినూత్నంగా మలుస్తాడు. సో..రాజమౌళి నుంచి అందరూ ఈ సీజన్‌లో తాము ఎక్కువగా ఎదురుచూస్తోంది ఈ చిత్రం కోసమేనని తెలిపారు. వైవిధ్య చిత్రాల ప్రేక్షకుల లిస్ట్‌లో కూడా మార్చి30న విడుదల కానున్న 'రంగస్థలం' మొదటి ప్లేస్‌ని ఆక్రమిస్తోంది.
ఇక ఈ టీజర్‌తో ఇందులో హీరో రామ్‌చరణ్ అలియాస్ చిట్టిబాబు చెవిటివాడని తేలిపోయింది. దీంతో ఇందులో నటిస్తున్న సమంత మూగదానిలా నటించనుందని వచ్చిన మాటలు కూడా నిజమేనని అందరూ బలంగా నమ్ముతున్నారు. ఇది కె.విశ్వనాథ్ దర్శకత్వంలో గుడ్డి, మూగ వారి మధ్య వచ్చే క్లాసిక్ చిత్రం 'సిరివెన్నెల' కాకపోయినా సుకుమార్ ఉండటంతో సమ్‌థింగ్ స్పెషల్ అనే అభిప్రాయం మాత్రం అందరిలో ఉంది. ఇక నిన్నటివరకు చిన్మయి గొంతుతో తన చిత్రాలలో అల్లరి చేసిన సమంత ఇందులో మూగదానిలా మాటలు లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? అనేది ఆలోచించడానికే ఎంతో అద్భుతంగా ఉంది. ఇక ఈ చిత్రం టీజర్ కేవలం రామ్‌చరణ్ పాత్రధారి చుట్టూనే తిరిగింది. సహజంగా హీరోల డామినేషన్ ఇండస్ట్రీలో ఎక్కువని '1' నేనొక్కడినే చిత్రం పోస్టర్ విషయంలో కోపంతో ఎగిరిపడిన సమంత ఈ చిత్రం టీజర్‌లో తన పాత్ర తాలూకు ఏమాత్రం సీన్ కూడా లేకపోవడం ఆమె అభిమానులను నిరుత్సాహానికి గురి చేస్తోంది.
మరోవైపు తమ అనసూయ టీజర్‌లో కనిపించలేదని ఆమె అభిమానులు కూడా మండిపడుతున్నారు. ఈ విషయంలో సమంత, అనసూయలు బాగానే ఫీలయ్యారని, కానీ ప్రస్తుతం చిట్టిబాబునే చూసి ఎంజాయ్ చేస్తున్నామని త్వరలో తాము ముందుకు వస్తామని తమ అభిమానులను శాంతింపజేస్తున్నారు.