రిపబ్లిక్‌డే సందర్భంగా ముగ్గురు స్టార్ హీరోలు తమ అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. సాధారణంగా ఈమధ్య మహేష్ నటించే చిత్రాల విడుదల తేదీలే కాదు ఫస్ట్‌లుక్ గట్రా వంటివి కూడా సమయంలో విడుదల కావడం లేదు. 'స్పైడర్' చిత్రంలోని అప్‌డేట్స్ కోసం మహేష్ అభిమానులు ఎంతగా వెయిట్ చేసి మరీ విసిగిపోయారో అందరికీ తెలుసు. ఇక 'బ్రహ్మూెత్సవం, స్పైడర్'లు పూర్తిగా నిరాశ పరచడంతో ఆయన అభిమానులు 'భరత్ అనే నేను' చిత్రంపైనే ఎన్నోఆశలు పెట్టుకున్నారు. రిపబ్లిక్‌డే సందర్భంగా ఇందులో మహేష్ యంగ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేది ఆడియోగా విడుదల చేశారు.
అదే సమయంలో అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. వెనుక వైపు బ్యాగ్రౌండ్‌లో మహత్మాగాంధీ, అంబేద్కర్ చిత్ర పటాలు కనిపిస్తుంటే సూట్‌కేసు పట్టుకున్న స్టైలిష్ మహేష్‌బాబు స్టిల్ అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇక అదే సమయంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా 'రంగస్థలం' టీం కూడా మెగాభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. 24 వ తేదీన టీజర్‌తో వచ్చిన చిట్టిబాబు కోడిపుంజును ఎత్తుకుని భారతీయ జెండాకి అభివాదం చేస్తున్న స్టిల్ పక్క మాస్‌గా ఉంటూ అలరిస్తోంది. ఇలా మహేష్ క్లాస్‌లుక్‌తో దర్శనం ఇవ్వగా, రామ్‌చరణ్ పక్కా మాస్‌గా ముందుకొచ్చాడు.
ఇక బన్నీకూడా 'నాపేరు సూర్య.. నాఇల్లు ఇండియా'లోని 'సైనిక్' సాంగ్‌తో వావ్ అనిపించాడు. ఈ మూడు చిత్రాలు వైవిధ్యభరితమైన కథాంశాలు కావడం, హీరోల పాత్రలు కూడా డిఫరెంట్‌గా ఉండనుండటం, మూడు చిత్రాలు సమ్మర్‌నే టార్గెట్ చేయడం పట్ల అభిమానుల్లో ఆనందోత్సాహాలు నిండిపోయాయి.