Advertisementt

ఈ బర్త్‌డే బాయ్ ఫ్రెండ్‌తో..!

Sun 28th Jan 2018 01:47 AM
kamal haasan,shruti haasan,birthday,plans revealed,boy friend,michael corsale  ఈ బర్త్‌డే బాయ్ ఫ్రెండ్‌తో..!
Shruti Haasan Birthday plans revealed ఈ బర్త్‌డే బాయ్ ఫ్రెండ్‌తో..!
Advertisement
Ads by CJ

శృతిహాసన్‌ నటనలోనే కాదు.. వ్యక్తిత్వంలో కూడా అందరికంటే డిఫరెంట్‌. ఆమె ఇటీవల సినిమాలలోఅసలు కనిపించడం లేదు. ఇక తన పర్సనల్‌ విషయాలు ఎవ్వరూ అడగవద్దని, తాను వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా ఆమె జీవితం ఉంటుంది. అంటే అచ్చు తన తండ్రి కమల్‌హాసన్‌ జీవితాన్నే ఆమె ఫాలో అవుతూ ఉంటుంది. ఇక నిన్నటి వరకు తన బర్త్‌డేల సందర్భంగా ఆమె సోషల్‌మీడియాలో 'ఈ రోజు నా బర్త్‌డే..హ్యాపీబర్త్‌డే టు మి' అని చెబుతూ పొంగిపోయేది. రెండేళ్ల కిందట తన తండ్రితో కలిసి చెన్నైలో తన బర్త్‌డేను వైభవంగా జరుపుకుంది. కిందటి ఏడు ఆమె తమన్నాతో పాటు తన క్లోజ్‌ఫ్రెండ్స్‌తో బర్త్‌డేని ఎంజాయ్‌ చేసింది. మరి ఈసారి బర్త్‌డే ఎక్కడ? ఎలా జరుపుకోనుంది? అనేది ఆసక్తిని కలిగిస్తోంది. 

ఈ ఏడాది బర్త్‌డే ఆమెకు సమ్‌థింగ్‌ స్పెషల్‌గా నిలవనుందని మాత్రం అంటున్నారు. ప్రస్తుతం ఆమె లండన్‌కి చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖేల్‌ కోర్స్‌లేతో పీకల్లోతు ప్రేమలో ఉంది. ఆమె అతనితో ముంబాయిలో అపార్ట్‌మెంట్‌ కూడా తీసుకుని సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తరుచుగా మైఖేల్‌కోర్స్‌లే ముంబై రావడం లేదా శృతిహాసనే లండన్‌కి వెళ్లడం చేస్తోంది. ఇటీవలే ఆమె తన తండ్రి కమల్‌హాసన్‌కి, తల్లి సారికాకు తన ప్రియుడిని పరిచయం చేసింది. మైఖేల్‌కోర్స్‌లే కూడా తమిళ సంప్రదాయ పట్టు వస్త్రాలలో కమల్‌, శృతిహాసన్‌లతో కలిసి ఓ వివాహవేడుకకు కూడా హాజరయ్యాడు. వీరిద్దరి మధ్య త్వరలో వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి. దాంతోనే శృతి 'సంఘమిత్ర'ని వదిలేయడంతోపాటు సినిమాలకు దూరంగా ఉంటోందని తెలుస్తోంది. 

మరోవైపు శృతిహాసన్‌ బర్త్‌డే సందర్బంగా ఆమెకి అడ్వాన్స్‌డ్‌ శుభాకాంక్షలతో ఆమె అభిమానులు ముంచెత్తుతున్నారు. వీరందరినీ ఉద్దేశించి మీ ప్రేమకు నేనిచ్చే పెద్దహగ్‌ ఇది. మీ ప్రేమాభిమానాలే నాకు మీరిచ్చే విలువైన బహుమతులుగా ఆమె పేర్కొంది. ఇక ఈ బర్త్‌డేను ఆమె మైఖేల్‌కోర్స్‌లేతో జరుపుకునేందుకు తన సన్నిహిత మిత్రులతో కలిసి ఇప్పటికే లాస్‌ఏంజెల్స్‌కి వెళ్లిందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ బర్త్‌డే సందర్భంగా అయినా ఆమె తన చిత్రాలు, భవిష్యత్తు, 'శభాష్‌నాయుడు'వంటి వాటి ప్రోగ్రెస్‌ని చెబుతుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది....! 

Shruti Haasan Birthday plans revealed:

Shruti's B-Day Bash With Boyfriend  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ