Advertisementt

చిరంజీవి పిలిచినా రాని ఆ స్టారెవరు?

Sun 28th Jan 2018 01:44 AM
chiranjeevi,revealed,secret,chalo,pre release,event  చిరంజీవి పిలిచినా రాని ఆ స్టారెవరు?
Senior Hero Skipped Chiranjeevi Function చిరంజీవి పిలిచినా రాని ఆ స్టారెవరు?
Advertisement
Ads by CJ

నాగశౌర్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వెళ్ళాడు. అయితే అక్కడ ఫంక్షన్ లో మెగాస్టార్ ఓ ఆసక్తికరమైన వార్త చెప్పారు. కుర్రాళ్లను ప్రోత్సహించేందుకే వచ్చానని.. తన కెరీర్ స్టార్టింగ్ లో ఓ సినిమా శతదినోత్సవానికి స్టార్ హీరోని పిలిస్తే ఆయన రాలేదు అప్పుడు నేను హర్ట్ అయ్యాను. అలా ఇప్పుడు నాగశౌర్య హర్ట్ అవ్వకూడదని ఈ ఫంక్షన్ కి వచ్చానని చెప్పారు.

చిరంజీవి చెప్పిన ఈ మాట ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. చిరంజీవి పిలిస్తే ఆ స్టార్ ఎందుకు రాలేదని ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ ప్రశ్న  అయిపోయింది. కెరీర్ స్టార్టింగ్ లో శతదినోత్సవ చిత్రం అంటే.. పున్నమి నాగు సినిమా అని చెప్పుకోవచ్చు. అందులో హీరో నరసింహరాజు అయిన.. చిరంజీవి లీడ్ రోల్. బహుశా చిరంజీవి ఈ సినిమా గురించే చెప్పి ఉంటారని అంతా అనుకుంటున్నారు.

1980ల నాటి కాలంలో పెద్ద స్టార్స్ అంటే... ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలను చెప్పుకోవచ్చు. ఆ హీరోస్ లో ఎవరు అని పరిశీలిస్తే ... నిర్మాణ సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్ కు అక్కినేని నాగేశ్వరరావు.. ఎస్వీ రంగారావు సన్నిహితంగా ఉండేవారు. వీరిద్దరిలో ఎవరైనా అయి ఉండవచ్చని అనుకుంటున్నారు. అయితే మరో పక్క 1980ల నాటి కాలంలో కృష్ణ ఏడాదికి కనీసం 10-12 సినిమాలు చొప్పున చేసేవారాయన ఎప్పుడు బిజీగా ఉండేవారని చెబుతారు. బహుశా ఆ బిజీ సమయంలో అడగడంతోనే.. కృష్ణ రాలేకపోయి ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సస్పెన్స్ ఇలా కంటిన్యూ అవాల్సిందే ఎందుకంటే చిరు దీనిపై నోరు విప్పరు కాబట్టి.

Senior Hero Skipped Chiranjeevi Function:

Chiranjeevi Revealed Top secret at Chalo Pre Release Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ