Advertisementt

చరణ్ సినిమాపై అంచనాలు మాములుగా లేవ్!

Sun 28th Jan 2018 01:40 AM
rangasthalam 1985,expectations,ram charan,samantha,teaser  చరణ్ సినిమాపై అంచనాలు మాములుగా లేవ్!
Expectations high on Ram Charan Rangasthalam చరణ్ సినిమాపై అంచనాలు మాములుగా లేవ్!
Advertisement
Ads by CJ

తాజాగా రిలీజైన 'రంగ‌స్థ‌లం' టీజ‌ర్ టాలీవుడ్ ను షేక్ చేస్తుంది.  చిట్టిబాబు లుక్‌కి, ఆ గెడ్డానికి, ఆ న‌డ‌క‌కు, న‌ట‌న‌కు టాలీవుడ్ ఫిదా అయిపోయింది. ఫస్ట్ లుక్ టీజర్ లోనే చరణ్ ఇలా ఉంటే సినిమాలో ఏ రేంజ్ లో ఉంటాడో అని తన ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.

'రంగ‌స్థ‌లం' టీజ‌ర్.. సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత పెంచేసింది. టీజర్ కి వచ్చిన స్పందన చూసి చెర్రీ ఉబ్బిత‌బ్బిబ్బయిపోతున్నాడు. తన ఫేస్ బుక్ పేజీలో ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. ముఖ్యంగా గోదావ‌రి ప్ర‌జ‌ల‌కు ధ్యాంక్స్ అంటూ పోస్టు చేశాడు. ప్రస్తుతం చరణ్ రాజ‌మండ్రిలో ఈ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు.

'రంగ‌స్థ‌లం' సినిమాలోనే చరణ్ మాస్ లుక్ ఇలా ఉంటే.. ఇక త‌రువాత వస్తున్న బోయ‌పాటి సినిమాలో ఇంకెలా ఉంటాడో.  అస‌లే మాస్ సినిమాల‌కు, యాక్ష‌న్ సీన్ల‌కు బోయ‌పాటి పెట్టింది పేరు. సో కచ్చితంగా బోయపాటి సినిమాలో చరణ్ ర‌చ్చ‌ర‌చ్చ చేయ‌డం ఖాయం అనిపిస్తుంది.

Expectations high on Ram Charan Rangasthalam:

Rangasthalam 1985 Expectations On Ram Charan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ