పైసా ఖర్చులేని ఉచిత సలహాలు ఇవ్వడంలో మన వారిని మించిన వారు మరెవ్వరూ ఉండరు. ముందు తమ పరిస్థితి, భవిష్యత్తు ఏమిటో తెలియని వారు కూడా ఇతరులకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. ఇక ఉన్నట్లుండి తెలంగాణ మహిళను అని గుర్తుకు వచ్చిన లేడీ అమితాబ్ రాములమ్మ తెలంగాణ మంత్రం పఠించి బాగానే లబ్దిపొందింది. ఇక బిజెపి నుంచి టీఆర్‌ఎస్, ఆ తర్వాత సొంత పార్టీ, ఆ తర్వాత మరలా కాంగ్రెస్‌కి వచ్చిన ఆమె తాజాగా పవన్‌కళ్యాణ్‌కి ఉచిత సలహా ఇచ్చింది. తెలంగాణలో పవన్‌కి అంత సీన్ లేదు.
ఆయన అన్నయ్య చిరంజీవినే తెలంగాణలో ఏమీ సాధించలేకపోయాడు. తెలంగాణలో విజయం సాధించడం, ఉనికిని చాటుకోవడం చంద్రబాబు వల్లే కాలేదు. ఆంధ్రా రాజకీయాలు వేరు. తెలంగాణ రాజకీయాలు వేరు. తెలంగాణకి సమయం వెచ్చించి పవన్ టైంని వృదా చేసుకోకుండా ఆ సమయాన్ని కూడా ఏపీకే కేటాయిస్తే ఆయనకు మంచింది. ఇక ఈమె మాత్రం తెలంగాణతోపాటు తమిళ రాజకీయాలలో వేలు పెట్టవచ్చుగానీ పవన్ తెలంగాణ రాజకీయాలలో ఉనికిని చాటుకుంటే ఈమెకి వచ్చిన ఇబ్బంది ఏమిటో మరి...!