Advertisementt

కార్ యాక్సిడెంట్, హీరో నానికి గాయాలు!

Sat 27th Jan 2018 04:24 PM
hero nani,meets,accident,injured,nani,safe  కార్ యాక్సిడెంట్, హీరో నానికి గాయాలు!
Nani Meets with Road Accident! Safe! కార్ యాక్సిడెంట్, హీరో నానికి గాయాలు!
Advertisement
Ads by CJ

జనవరి 26 శుక్రవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో యంగ్ హీరో నాని ప్రయాణిస్తున్న కార్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లో ప్రమాదానికి గురైంది. కార్ నడుపుతున్న డ్రైవర్ అలసట కారణంగా నిద్రలోకి జారుకోవటంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో నాని ముక్కు భాగంతో పాటు రెండు పళ్లకి తీవ్ర గాయాలు అవ్వటంతో చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి స్పందించటానికి నాని సన్నిహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ముందుకు రావటం లేదు. అయితే నాని మాత్రం క్షేమంగానే వున్నారని తెలియజేశారు ఆయన వ్యక్తిగత సిబ్బంది.

అయితే తాజాగా ఈ యాక్సిడెంట్‌పై నాని తన ట్విట్టర్ పేజీలో స్పందించారు. ‘నాకేం కాలేదు. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. కొద్దిగా రెస్ట్ తీసుకుని మళ్లీ కృష్ణార్జున యుద్ధం షూటింగ్‌లో పాల్గొంటాను’ అంటూ నాని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. గత ఏడాది నేను లోకల్, నిన్ను కోరి, ఎం.సి.ఏ చిత్రాలతో అలరించిన నాని ఈ ఏడాది కూడా కృష్ణార్జున యుద్ధంతోపాటు మరో రెండు చిత్రాలతో ప్రేక్షకులని పలకరించాలని నిర్విరామంగా పనిచేస్తున్నాడు.

Nani Meets with Road Accident! Safe!:

Nani meets with an Accident! Injured?  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ