నాగచైతన్య ఇండస్ట్రీకి వచ్చి దగ్గరదగ్గరగా పదేళ్లు అవుతుంది. కానీ ఇంతవరకు స్టార్ హీరో అనిపించుకోలేకపోయాడు. యంగ్ హీరోస్ నాని, శర్వా వరస పెట్టి హిట్స్ కొడుతుంటే.. అంత బ్యాక్ గ్రౌండ్ వున్న చైతూకి మాత్రం పెద్ద బ్రేక్ రావడం లేదు. లేటెస్ట్ గా వచ్చినా... 'ప్రేమమ్', 'రారండోయ్ వేడుక చూద్దాం' మంచి టాక్ తెచ్చుకున్నా.. చైతూని పైకి లేపలేకపోయాయి.
దీంతో చైతు ఫ్యాన్స్ కూడా ఇంకెప్పుడు మా హీరోని స్టార్ గా చూస్తామో అని ఆందోళన పడుతున్నారు. అయితే ఎటువంటి అంచనాలు లేకుండా వస్తోన్న నాగచైతన్య తదుపరి చిత్రం సంచలనం అవుతుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య చేస్తోన్న 'సవ్యసాచి'పై చాలా మంచి బజ్ వుంది. టాలీవుడ్ కు మరో 'అర్జున్ రెడ్డి' అయ్యే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
ఇందులో నటిస్తోన్న మాధవన్ కూడా 'సవ్యసాచి' గురించి చాలా గొప్పగా చెబుతున్నాడు. ఎంతోమంది మహామహులతో నటించిన మాధవన్ ఈ చిత్రం గురించి ఎక్సయిట్ అవుతూ వుండడం 'సవ్యసాచి'పై మరింత బజ్ పెంచుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందో.. అలానే నాగచైతన్యని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లే చిత్రమవుతుందో? లేదో? వేచి చూద్దాం.