Advertisementt

'ఖుషి'లో పవన్ కళ్యాణ్, ఇప్పుడు చైతూ!

Fri 26th Jan 2018 03:25 PM
naga chaitanya,ego,pawan kalyan,kushi movie,director maruthi  'ఖుషి'లో పవన్ కళ్యాణ్, ఇప్పుడు చైతూ!
Naga Chaitanya in Pawan Kalyan Way 'ఖుషి'లో పవన్ కళ్యాణ్, ఇప్పుడు చైతూ!
Advertisement
Ads by CJ

 

పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో అవ్వడు.. సెట్ చేస్తాడు అని ఓ సినిమాలో చెప్పిన డైలాగ్. అందుకు తగ్గట్టుగానే పవన్ కు చాలానే మేనరిజమ్స్ వున్నాయి. పవన్ కెరీర్ లో ప్రాముఖ్యత గల మూవీ 'ఖుషి'. ఈ సినిమాలో పవన్ పాత్ర ఇగోతో కూడుకుని ఉంటది. హీరోయిన్ గా నటించిన భూమికకు కూడా ఇగో ఉంటది. కానీ ఈ మూవీని పరిశీలిస్తే.. హీరో హీరోయిన్ ఇద్దరి పాత్రలు ఈ ఇగో చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఆ ఇగో లోంచి బైటకు ఎలా వచ్చారు వీరు ఇద్దరు అనేది ఓవరాల్ గా ఖుషీ మూవీ థీమ్.

అయితే అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. నాగ చైతన్య ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ఓ చిత్రం చేయటానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో నాగ చైతన్య ఇగో వున్న పాత్రలలో నటిస్తున్నాడు. మారుతీ సినిమా అంటే హీరోకు ఏదో ఒక డిఫెక్ట్ ఉంటది. అలానే ఇప్పుడు చైతుకి ఇగో సెట్ చేశాడట.

'భలేభలే మగాడివోయ్'లో నానికి మతిమరుపు.. 'మహానుభావుడు'లో శర్వాకు ఓసీడీ అంటూ కామెడీ చేసిన మారుతి.. ఇప్పుడు చైతుకు ఇగో తగిలిస్తున్నాడు. పవన్ 'ఖుషి' తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఇగో బేస్డ్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు చైతు.

Naga Chaitanya in Pawan Kalyan Way:

Naga Chaitanya Role in Maruthi Movie Revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ