కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావుది దుందుడుకు స్వభావం. నాడు ఓదార్పు యాత్రను వైఎస్ జగన్ చేస్తున్న సమయంలో తాను కూడా యాత్రలు చేస్తానని, అధిష్టానం అనుమతి ఇస్తే తన ఫాలోయింగ్ ఏమిటో చూపిస్తానని వ్యాఖ్యలు చేయడం, విహెచ్‌కి సొంతగా ఒక ఓటు కూడా పడదని విమర్శలు కూడా వచ్చాయి. ఇక తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ 'జనసేన'ని 'భజనసేన'అని విమర్శించాడు.
దీనికి ఎంతో తెలివిగా పవన్ రాబోయే ఎన్నికల్లో విహెచ్‌ని ముఖ్యమంత్రి అభ్యర్దిగా ప్రకటిస్తే ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తానని చెప్పాడు. వీహెచ్‌తో కలసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నాను. వీహెచ్‌గారు నాతో రండి. పల్లె పల్లెకు ఇంటి ఇంటికి తిరిగి ప్రజాసమస్యలు తెలుసుకుందామని అన్నాడు. ఇక కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి, ప్రభుత్వాలకు ప్రజలు అండగా ఉండాలని పవన్ కోరాడు.
ఇక పవన్ వ్యాఖ్యలపై విహెచ్ స్పందించాడు. నేను పవన్‌తో కలిసి నడవడం కాదు. పవనే నాతో కలిసి వస్తే పల్లెల్లో రైతులు పడుతున్న కష్టాలు, ప్రాజెక్ట్‌లలో అవినీతిని చూపిస్తానని తన ఇగోని బయటపెట్టాడు. ఇక నేను కష్టపడి ఒక్కో మెట్టు పైకి ఎదిగి వచ్చిన నాయకుడిని. పవన్ ఉద్దేశ్యం అదే అయి ఉంటుంది. ఇక కాంగ్రెస్‌కి సీఎంని అధిష్టానం మాత్రమే నిర్ణయిస్తుంది. పవన్‌కి నామీద ఇంత అభిమానం ఉన్నందుకు సంతోషంగా ఉంది.
కేవలం పవన్ చర్యలు, ఆయన కామెంట్స్‌కి అనుగుణంగానే తన కామెంట్స్ ఉంటాయని చెప్పిన విహెచ్ ఆల్‌రెడీ పవన్ వ్యాఖ్యలతో సీఎం అయిపోయినట్లుగా ఉబ్బితబ్బిబవుతున్నాడు. దీంతో ఆయన ఆనందాన్ని మనం ఎందుకు కాదనాలి? అర్జున్‌రెడ్డి చెప్పినట్లుగా చిల్ తాతయ్యా....!