Advertisementt

హలో.. ఫోన్ తో నాగ్ కి కొత్త తలనొప్పి!

Fri 26th Jan 2018 01:14 PM
nagarjuna,lands,legal trouble,phone number,hello movie  హలో.. ఫోన్ తో నాగ్ కి కొత్త తలనొప్పి!
'Hello!' number: Legal notice to Nagarjuna! హలో.. ఫోన్ తో నాగ్ కి కొత్త తలనొప్పి!
Advertisement
Ads by CJ

నాగార్జున 'శివమణి' చిత్రం చేసేటప్పుడు పెద్దగా మొబైల్‌ఫోన్స్‌ వాడుకలో లేవు. కానీ ఆ చిత్రంకి టైటిల్‌గా ఫోన్‌ నెంబర్‌ని కూడా వాడటం. నాటి రోజుల్లోనే ఆ నెంబర్‌కి విపరీతంగా ఫోన్స్‌ రావడంతో ఓ వ్యక్తి న్యూసెన్స్‌కి లోనయ్యాడు. తర్వాత హిందీ 'గజిని' సమయంలో అమీర్‌ఖాన్‌ బాడీ మీద ఆయన ఫోన్‌నెంబర్‌ రాసి పబ్లిసీటీ చేశారు. దీని వల్ల ఓ మహిళకు మనశ్శాంతి లేకుండా పోయింది. దీంతో సినిమాలలో మొబైల్‌ ఫోన్ల వాడకం విషయంలో పలు వినతులు, ఫిర్యాదులు సెన్సార్‌బోర్డ్‌కి అందాయి. దాంతో సెన్సార్‌బోర్డ్‌ స్పందించి సినిమాలలో ఎవరివైనా మొబైల్‌ నెంబర్‌ వాడేటప్పుడు ఆయా వ్యక్తుల పర్మిషన్‌ తీసుకోవాలని కూడా సూచించింది. లేకపోతే యూనిట్‌లోని వారి అనుమతితో యూనిట్‌ మెంబర్స్‌ నెంబర్లే వాడాలని కూడా చెప్పింది. కానీ మన మేకర్స్‌ మాత్రం ఆ విషయం పట్టించుకోవడం లేదు. కానీ ఈమధ్య మొబైల్‌ నెంబర్లను సినిమాలలో వాడేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కానీ నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌లో విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో అఖిల్‌ నటించిన చిత్రం టైటిల్‌ 'హలో' నుంచి సినిమా కథ మొత్తం మొబైల్‌ నెంబర్‌ చుట్టూనే తిరుగుతుంది. వంద రూపాయల నోటుపై స్పష్టంగా ఫోన్‌నెంబర్‌ని రాసి మరీ చూపించారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఈ నెంబర్‌ జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన వికాస్‌ ప్రజాపతి నెంబర్‌ అట. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి పలువురు ఆయనకు ఫోన్‌ చేసి కళ్యాణి మీరేనా అని అడుగుతున్నారట. ఆయనకు తెలుగు సినిమాల గురించి తెలియకపోవడంతో ఎవరీ కళ్యాణి అని ఆరాతీయగా, నాగార్జున తీసిన చిత్రంలోని హీరోయిన్‌ నెంబర్‌ అని తెలవడంతో నాగార్జున వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నా పనికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన ఏకంగా నాగార్జున తనకి 50లక్షలు చెల్లించాలంటూ కేసును వేశాడు.

నాగ్‌ మాత్రం టెలికాం ఆపరేటర్‌ నుంచి అనుమతి తీసుకున్నాం అంటుంటే టెలికాం ఆపరేటర్లు మాత్రం ఎవ్వరూ మమ్మల్ని సంప్రదించలేదని చెబుతున్నారు. అయినా ఉచితంగానే సిమ్‌లు వస్తున్న ఈరోజుల్లో కొత్త సిమ్‌ తీసుకుని వాడి వదిలేయకుండా నిర్మాత నాగార్జున ఇంత కక్కుర్తి ఎందుకు పడ్డాడా? అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

'Hello!' number: Legal notice to Nagarjuna!:

Nagarjuna lands in legal trouble for usage of phone number in 'Hello'

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ