ఏవో బాధలు, ఆలోచనలు ఉన్నా కూడా నటీనటులు షూటింగ్ సమయంలో వాటన్నింటిని మర్చిపోయి పరకాయ ప్రవేశం చేయాల్సివుంటుంది. ఇక ఇష్టం లేని రొమాన్స్‌లు, డ్రస్‌లు, లిప్‌లాక్ సీన్స్‌లో కూడా సహజంగా నటించాలి. ఎంతో ఎండలో తీసే షాట్‌లో కూడా నవ్వుతూ కనిపించాలి. విపరీతమైన చలిలో కూడా సెగలు పుట్టించాలి.. ఇలా షూటింగ్స్‌లో నటీనటులు తమను తాము, తమ కష్టాలను, ఆలోచనలను మర్చిపోయి నటించాలి. కాబట్టి నటన అంటే అనుకున్నంత ఈజీ కాదు. ఇక హీరోలు యాక్షన్ సీన్స్‌లో ఒళ్లు హూనం చేసుకోవాల్సి వుంటుంది.
కాగా 'భాగమతి' చిత్రం షూటింగ్ సమయంలో స్వీటీ అనుష్క కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని డస్ట్ ఇరిటేషన్‌కి లోనైంది. కథ ప్రకారం 500ఏళ్ల నాటి భవంతి ఉంటుంది. అందులో ఎవ్వరూ నివాసం ఉండనందున 500ఏళ్ల నుంచి పాడుపడిన ఆ భవంతిలో బోలెడు దుమ్ము ఉంటుంది. ఐఏయస్ అయిన చంచల అలియాస్ అనుష్కని ఆ భవంతిలో పడేస్తారు. అక్కడ నుంచి ఆమె బయటికి వచ్చేందుకు 'భాగమతి' ఆత్మ ఒప్పుకోదు. అనుష్కని ఆ ఆత్మ నేలపై ఈడ్చుకుని వెళ్తుంది. ఈసీన్ సహజంగా రావడం కోసం ఎంతో దుమ్ముని ఆ భవంతి సెట్‌లోని నేలపై ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఉంచాడు.
చంచలని భాగమతి ఆత్మ నేలపై ఈడ్చుకుని వెళ్లేటప్పుడు ఆ దుమ్మంతా పైకి లేచి నాచురల్‌గా కనిపించాలి. ఈ షాట్ దెబ్బకి అనుష్కకి తీవ్ర అస్వస్థత కలిగిందట. అయినా సినిమా బాగా రావడానికి ఆమె ఎంతో కష్టపడి అలాంటి సీన్స్‌లో నటించిందట. ఇక ఈ చిత్రం తర్వాత తాను కొత్తగా ఏ చిత్రం కథలు వినడం గానీ, సినిమాలు ఒప్పుకోవడం జరగలేదని అనుష్క క్లారిటీ ఇచ్చింది.