Advertisementt

రంగస్థలం టీజర్ పై సెలెబ్రెటీస్ ట్వీట్స్..!

Thu 25th Jan 2018 11:08 PM
celebrities,tweets,ram charan,rangasthalam,movie,teaser  రంగస్థలం టీజర్ పై సెలెబ్రెటీస్ ట్వీట్స్..!
Celebrities Tweets on Rangasthalam Movie Teaser రంగస్థలం టీజర్ పై సెలెబ్రెటీస్ ట్వీట్స్..!
Advertisement
Ads by CJ

సుకుమార్ తీసిన మాస్ సినిమా ‘రంగస్థలం’ పై రోజురోజుకి ఎక్సపెక్టేషన్స్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్టార్ ఐన దగ్గర నుండి ఇదొక వార్త బయటకు వచ్చి సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక నిన్న రిలీజ్ ఐన టీజర్ చూశాక అంతకుమించి ఎక్సపెక్టేషన్స్ ఎక్కువ అయ్యిపోయాయి. ఎందుకంటే ఆ టీజర్ ఆలా వుంది. టీజర్ చూసిన ప్రేక్షకుడితో పాటు టాలీవుడ్ టాప్ సెలెబ్రెటీస్ తమ ట్వీట్స్ ద్వారా వారి ఫీలింగ్ వ్యక్తపరిచారు.

ఎస్‌.ఎస్‌. రాజమౌళి: చరణ్‌, సుక్కు (సుకుమార్)కు అభినందనలు. ఈ సీజన్‌లో నేను ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రమిది. 

అల్లు అర్జున్‌: వాహ్...         

లావణ్య త్రిపాఠి: రంగస్థలం టీజర్‌ మైండ్‌బ్లోయింగ్‌గా ఉంది. చాలా చాలా బాగా రూపొందించారు. చిత్ర బృందానికి, మన సౌండ్‌ ఇంజనీరు దేవిశ్రీ ప్రసాద్‌కు శుభాకాంక్షలు.

అల్లు శిరీష్‌: చిట్టిబాబుకు హలో చెప్పండి. సుక్కు, మన రామ్‌చరణ్‌ రచ్చ చేశారు.

నవదీప్‌: అద్భుతం.

ప్రగ్యాజైశ్వాల్‌: టీజర్‌ చాలా నచ్చింది.. సినిమా కోసం ఎదురుచూస్తున్నా..

మారుతి: ఇది చరణ్‌బాబు, సుకుమార్‌ కెరీర్‌లోనే కచ్చితంగా ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది.

ఇలానే వీరితో పాటు చాలా మంది సెలెబ్రెటీస్ టీజర్ గురించి తమ అభిప్రాయాన్ని ట్వీట్స్ ద్వారా తెలియజేసారు. ఇక ఈ సినిమాలో చరణ్ కి జోడిగా సమంత నటిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ పని చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మార్చి 30న ఈ సినిమా విడుదల కాబోతోంది అని మేకర్స్ స్పష్టం చేశారు.

Celebrities Tweets on Rangasthalam Movie Teaser:

Celebrities Praises Ram Charan and Sukku after Teaser Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ