తెలుగు మహిళా రాజకీయ నాయకుల్లో నేటి తరానికి నోటికి అడ్డుఅదుపు లేకుండా, సంస్కారంలేని విధంగా మాట్లాడే వైసీపీ నేత రోజా గురించే అందరికీ తెలుసు. కానీ నిన్నటితరంలో ఆమె కంటే బూతులు మాట్లాడుతూ, మగరాయుళ్లుగా పేరొందిన ఇద్దరు ఫైర్‌బ్రాండ్స్ ఉన్నారు. బహుశా వారిద్దరే రోజాకి గురువులయి ఉంటారు. వారే కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి, టిడిపి నేత నన్నపనేని రాజకుమారి. ఇక రేణుకాచౌదరి విషయానికి వస్తే ఆమెకి సోనియాగాంధీతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఈమె కూతురు రాహుల్‌గాంధీకి ఇష్టమైన వారిలో ఒకరనే ప్రచారం కూడా ఉంది.
ఇక తాజాగా రేణుకా చౌదరి మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో తాను ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపిస్తానని ఎవరు అడ్డుకుంటారో చూస్తానని వ్యాఖ్యానించింది. ఖమ్మం జిల్లాలోని అన్ని స్థానాలను తాము గెలుచుకుంటామని శపథం చేసింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమేగానీ చేతల ప్రభుత్వం కాదని నిప్పులు చెరిగింది. ఇక పవన్‌కళ్యాణ్‌ని,ఆయన జనసేనని ఉద్దేశించి మాట్లాడుతూ, పాపం.. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో పసివాడు అని వ్యాఖ్యానించింది. కానీ ఎప్పుడు వచ్చాము? అనుభవం ఉందా? లేదా? అనేది ముఖ్యం కాదని, మహేష్‌బాబు 'పోకిరి'లో చెప్పినట్లు ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యమని ఆమె గుర్తించాలి. సొంత నియోజకవర్గాలలోనే గెలవలేని వారు ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారో అనేదే సందేహం.
ఇక పవన్ విషయంలో ఆయనకు సరైన అవగాహనలేదని విమర్శిస్తున్నారు. దీనికి పవన్‌రాబోయే రోజుల్లో ఎవరికి ఎంత అవగాహన ఉందో తేలుతుందని తేల్చిచెప్పాడు. ఇక ఎన్టీఆర్ సమయంలో కూడా కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మొహానికి రంగులేసుకునే వారికి రాజకీయాలు ఏమి తెలుసు? వారికి ఓట్లు ఎవరు వేస్తారు? అని విమర్శలు గుప్పించారు. చివరికి కాంగ్రెస్ నాయకులు చేసిన విపరీత వ్యాఖ్యలే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుని పోయి టిడిపి గెలిచి ఎన్టీఆర్ కేవలం 8నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన నేతగా రికార్డు పుటలకెక్కాడు. మరి పవన్ విషయం ఏమిటనేది ఎన్నికల్లో గానీ తేలదు.