Advertisementt

'భరత్ అనే నేను' రికార్డ్స్ మొదలైనాయ్!

Wed 24th Jan 2018 10:15 PM
mahesh babu,koratala siva,records,audio rights,lahari  'భరత్ అనే నేను' రికార్డ్స్ మొదలైనాయ్!
Mahesh Babu Bharath Ane Nenu Audio Rights Record 'భరత్ అనే నేను' రికార్డ్స్ మొదలైనాయ్!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో ప్రస్తుతం 'భరత్ అనే నేను' సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ వరసగా రెండు సినిమాలు ప్లాప్ అయ్యిన ఈ సినిమాపై ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించడం లేదు. మహేష్ - కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు మాములుగా లేవు.

'భరత్ అనే నేను' సినిమా విడుదల దగ్గర పడేకొద్దీ ఏదో ఒక రికార్డు నమోదు అవుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ లో నిర్మాతకీ 70 - 80% వచ్చాయని తెలుస్తోంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో రైట్స్ లహరి మ్యూజిక్ వారు ఓ పెద్ద అమౌంట్ కి కొనుక్కున్నట్లు తెలుస్తుంది. ఇక రీసెంట్ గా శాటిలైట్ హక్కుల ధర రికార్డ్ సృష్టించింది.

ఇప్పటివరకు మహేష్ సినిమాల్లో ఏ సినిమాకి రానంతగా అన్ని బాషలలో కలిపి స్టార్ మా రూ.39 కోట్లకు దక్కించుకుంది. అలానే డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. సినిమా బడ్జెట్ లో దాదాపు 75% రికవర్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ వస్తే చాలు సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Mahesh Babu Bharath Ane Nenu Audio Rights Record:

Mahesh Babu and Koratala Siva Movie Bharath Ane Nenu Records starts

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ