Advertisementt

ప్రభాస్‌తో నటించడం అదృష్టమంటోంది!

Wed 24th Jan 2018 09:01 PM
sharaddha kapoor,acting,prabhas,happy,saaho movie  ప్రభాస్‌తో నటించడం అదృష్టమంటోంది!
Shraddha Kapoor Happy with Saaho ప్రభాస్‌తో నటించడం అదృష్టమంటోంది!
Advertisement
Ads by CJ

'బాహుబలి' చిత్రంతో ప్రభాస్‌ రేంజ్‌ ఒక్కసారిగా మారిపోయింది. ఇండియన్‌ సినిమాకి ఐకానిక్‌గా, నేషనల్‌ స్టార్‌గా ఆయన మారాడు. ఇక ఆయన 'మిర్చి' తర్వాత కేవలం 'బాహుబలి' రెండు పార్ట్‌లకే ఐదేళ్లు కేటాయించాడు. దాంతో వెంటనే ఆయన సుజీత్‌ దర్శకత్వంలో యువి క్రియేషన్స్‌ వంటి హోమ్‌ బేనర్‌లో వంశీ, ప్రమోద్‌, విక్కీలతో కలిసి 'సాహో' చిత్రం చేస్తున్నాడు. 'బాహుబలి'లో కత్తులు, గుర్రపుస్వారీలు చేసిన ప్రభాస్‌ 'సాహో' వంటి యాక్షన్‌ థ్రిల్లర్‌లో తుపాకులు, బైక్‌ ఛేజింగ్‌లు చేయనున్నాడు.

ఇక ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే అబుదాబిలో ప్రారంభం కావాల్సివుంది. కానీ వారు షూటింగ్‌ చేయాల్సిన లోకేషన్లకి సంబంధించిన పర్మిషన్స్‌ లేట్‌ కావడంతో టైం వేస్ట్‌ చేయకుండా హైదరాబాద్‌ షెడ్యూల్‌ని పూర్తి చేశారు. చివరకి అబుదాబి నుంచి పర్మిషన్లు రావడంతో త్వరలో యూనిట్‌ అక్కడికి వెళ్లనుంది. అక్కడ మొదట 60రోజుల షూటింగ్‌ని ప్లాన్‌ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం కేవలం 40రోజుల్లో అక్కడ షూటింగ్‌ని పూర్తి చేయనున్నారు. ఈ భారీ షెడ్యూల్‌తో దాదాపు టాకీ, యాక్షన్‌ పార్ట్‌ పూర్తవుతుంది. తర్వాత పాటలను చిత్రీకరించి దసరా లేదా దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ భామ శ్రద్దాకపూర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఆమె మాట్లాడుతూ, ప్రభాస్‌ వంటి హీరోతో నటించడం నాకెంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషలతో పాటు పలు భాషల్లో విడుదల కానుంది. ఇది నాకు గొప్ప అవకాశం. ఇలా నేను చేస్తున్న మొదటి బహుభాషా చిత్రం 'సాహో' అని చెప్పుకొచ్చింది.

Shraddha Kapoor Happy with Saaho:

Sharaddha Kapoor about Acting with Prabhas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ