Advertisementt

పూరీ, చార్మిల చిందులు!

Tue 23rd Jan 2018 05:40 PM
charmi,puri jagan,mehabooba team,party  పూరీ, చార్మిల చిందులు!
Party time to Puri Jagan and Charmi పూరీ, చార్మిల చిందులు!
Advertisement
Ads by CJ

దశాబ్దకాలంలో పూరీ జగన్నాథ్‌ కెరీర్‌ గాడి తప్పింది. ఎన్టీఆర్‌తో చేసిన 'టెంపర్‌' మినహా అయనకు చెప్పుకోదగ్గ హిట్‌ లేదు. ఇక కాలం కూడా కలిసిరావడం లేదు. చార్మి ఆయన లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనకు అదృష్టం కనిపించకుండా పోయింది. ఇక చార్మి-పూరీల మధ్య ఏదో ఉందని పుకారు కూడా బాగా వినిపిస్తోంది. డ్రగ్స్‌ ఆరోపణల్లో కూడా వీరిద్దరి పేరు ప్రముఖంగా వినిపించాయి. పూరీ ఆఫీస్‌ విషయాల నుంచి ఆయన సహాయకుల వరకు చార్మి కనుసన్నలలోనే అన్ని జరుగుతున్నాయి. ఇక చార్మి పూరీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి పూరీకే కాదు చార్మికి కూడా కలిసిరావడం లేదు. టి.రాజేందర్‌ ద్వారా సినిమా తెరకి పరిచయమై, తన 15వ ఏట 'నీతోడు కావాలి'తో టాలీవుడ్‌కి తెరంగేట్రం చేసిన చార్మి స్టార్‌ హీరోలతో కూడా నటించింది. ఇక ఐటం సాంగ్స్‌తో పాటు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలలో కూడా తన సత్తా చాటింది.

ఈమె పూరీ జగన్నాథ్‌తో కలసి పూరీ కనెక్ట్స్‌ని స్థాపించి అందులో నిర్మాతగా 'జ్యోతిలక్ష్మి' చిత్రం చేసింది. తర్వాత 'పైసావసూల్‌' చిత్రానికి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. ఇక ప్రస్తుతం పూరీ చేస్తోన్న 'మెహబూబా' చిత్రం ఎంతో కీలకంగా మారింది. ఈ చిత్రంహిట్‌ ద్వారా పూరీ మరలా లైమ్‌ లైట్‌లోకి రావడమే కాదు... తన తనయుడు ఆకాష్‌ పూరికి కూడా హిట్‌ ఇవ్వాల్సిన కీలక పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. ఇక 'మెహబూబా' చిత్రం పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా 1971 ఇండో పాక్‌ యుద్దం నేపధ్యంలో సాగే హైలీ ఇంటెన్స్‌, ఫ్యాషనేట్‌ లవ్‌స్టోరీగా రూపొందుతోంది.

ఈ చిత్రం అప్‌డేట్స్‌ని చార్మి ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు తెలియజేస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రం కాస్ట్‌ అండ్‌ క్రూతో పాటు పూరీ జగన్నాథ్‌, చార్మిలు కలిసి బాలీవుడ్‌ హిట్‌ సాంగ్స్‌కి లయబద్దంగా డ్యాన్స్‌లు చేసిన వీడియో బాగా వైరల్‌ అవుతోంది. చార్మి తన పంధాలో డ్యాన్స్‌లో ఇరగదీయగా ఆమెతో పాటు పూరీ కూడా కాళ్లు కదిపాడు. ఇక ఆకాష్‌ పూరీ మాత్రం కాస్త బిడియంగా కనిపిస్తుంటే హీరోయిన్‌ నేహాశెట్టి కూడా బాగా ఎంజాయ్‌ చేస్తోంది.

Party time to Puri Jagan and Charmi:

Puri Jagannadh and Charmi Party with Mehabooba Team

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ