ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోస్ హవా నడుస్తుంది. ఒక వైపు భారీ బడ్జెట్స్ తో సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటున్న స్టార్ హీరోస్.. మరోవైపు ప్రయోగాలు చేస్తూ విజయాలు అందుకుంటున్న యంగ్ హీరోస్. అందుకే యంగ్ హీరోస్ తో సినిమాలు తీసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇక ఈ యంగ్ హీరోస్ సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలిస్తే షాక్ అవుతారు..
వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని.. 'నేను లోకల్' సినిమాతో ముప్పై కోట్ల రూపాయల మార్కెట్ సంపాదించాడు. దీంతో నాని దాదాపు 5 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తుంది. అలానే మరో హీరో శర్వానంద్ కూడా 'శతమానం భవతి, మహానుభావుడు' వంటి సినిమాలతో భారీ విజయాలని సొంతం చేసుకుని నాని రేంజ్‌లోనే పారితోషికం అందుకుంటున్నాడట.
ఇక మొదటి సినిమా నుండి వరుసగా ప్రయోగాలు చేస్తూ అనూహ్య విజయాలు అందుకునే హీరో నిఖిల్ కూడా సినిమాకు 2.5 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు వినికిడి. ఇకపోతే ఫిదా సక్సెస్ తర్వాత వరుణ్ తేజ్ దాదాపు 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అలానే సాయి ధరమ్ తేజ్ సినిమాకు 2.5 కోట్ల రూపాయలు చార్జ్ చేస్తున్నట్టుగా సమాచారం.