గత ఏడాది అన్నింటికంటే దేశవ్యాప్తంగా సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన 'పద్మావతి' చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చివరకు ఈ చిత్రంలో సెన్సార్‌వారి సూచనలకు అనుగుణంగా కొన్ని సీన్స్‌ని రీషూట్ చేసి యూనిట్ సినిమాని ఈనెల 25న విడుదల చేసేందుకు సిద్దమయింది. ఇక ఇందులో రాజ్‌పుత్‌లని కించపరిచే సీన్స్ కూడా లేవని చెప్పిన సెన్సార్ కూడా విడుదలకు ఓకే అనినా కూడా ఈ చిత్రం అసలు విడుదలే కాకూడదని కర్ణిసేన, రాజ్‌పుత్‌ల ఆందోళన మాత్రం కొనసాగుతూనే ఉంది. సినిమా విడుదల చేయాలా లేదా అనేది సెన్సార్ చూసుకుంటుంది. ఇందులో రాజ్‌పుత్‌లని ఎంతో వీరోచితంగా చూపించారని ట్రైలర్‌లోని సంభాషణలు వింటేనే అర్ధమవుతోంది.
కానీ కొన్ని రాష్ట్రాలు శాంతి భదత్రల వంకతో ఈ చిత్రాన్ని తమ రాష్ట్రాలలో విడుదలను బ్యాన్ చేశాయి. కానీ ఈ యూనిట్ సుప్రీంకోర్టుకి వెళ్లితే ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా విడుదల చేయాలని కోర్టు సినిమా టీంకి అనుకూలంగా తీర్పు నిచ్చాయి. మరోవైపు ముస్లింలు కూడా ఈ చిత్రం చూడవద్దని వారి తమ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక 'పద్మావత్' సినిమా సెగ తెలంగాణకు కూడా పాకింది. హైదరాబాద్‌లోని అగాపుర వద్ద ఉన్న రాణా ప్రతాప్‌సింగ్ విగ్రహం వద్ద సినిమా విడుదల చేయవద్దని ఆందోళన నిర్వహించారు. సినిమాని విడుదల చేస్తే తదుపరి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఇక నగరంలోని ట్రివోలి థియేటర్లలలో ఈ చిత్రం విడుదల చేయడాన్ని నిరసిస్తూ 50 మంది రాజ్‌పుత్ యువకులు దర్శకునికి, సినిమాకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.