ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. నాలుగు సినిమాలు ప్లాప్. యావరేజ్ టాక్స్ తో థియేటర్స్ లో రన్ అవుతున్నాయి. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా రెండు స్ట్రయిట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ రెండు సినిమాలు కోసం ఏ సినిమాను థియేటర్స్ నుండి తీసేస్తారని ఆలోచిస్తే.. ఉందిగా 'రంగుల రాట్నం' అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
ఉన్న నాలుగు సినిమాల్లో రంగుల రాట్నం సినిమా ఎప్పుడు వచ్చిందో తెలియకుండా రిలీజ్ చేశాడు నాగార్జున. ఇంత హెవీ కాంపిటిషన్ లో ఈ సినిమా వచిన్నట్టు కూడా ఎవరికి తెలియలేదు. వచ్చినా ఈ సినిమా ఎవర్నీ మెప్పించలేదు. ఫలితంగా థియేటర్లలోకి వచ్చిన వారం రోజులకే దుకాణం సర్దేసింది.
జనవరి 26కి 'ఆచారి అమెరికా యాత్ర', 'భాగమతి' సినిమాలు వస్తున్నాయి. అనుష్క నటించిన 'భాగమతి'కి భారీగా థియేటర్స్ చూస్తున్నారు నిర్మాతలు. ఎందుకంటే ఈ సినిమా కోసం చాలానే ఖర్చుపెట్టారు కాబట్టి అందుకే కాస్తయినా తేరుకోవాలంటే భారీ రిలీజ్ అవసరం అని భావిస్తున్నారు నిర్మాతలు. అందుకే ఆంధ్రాలో వాళ్ల దగ్గరున్న థియేటర్లలో పాటు నైజాం, సీడెడ్ లో ఎక్కువ థియేటర్ల కోసం కసరత్తు చేస్తోంది 'భాగమతి' టీమ్. ఇందులో భాగంగా మ్యాగ్జిమమ్ థియేటర్ల నుంచి 'రంగులరాట్నం' ఖాళీ అయ్యే అవకాశాలున్నాయి.
ఇక 'ఆచారి అమెరికా యాత్ర' సినిమా కోసం కూడా ఉన్నంతలో మంచి థియేటర్ల కోసం చూస్తున్నారు. వీళ్ళు కూడా 'రంగులరాట్నం' థియేటర్స్ పై పడుతున్నారు. సో.. రాబోయే శుక్రవారానికి 'రంగులరాట్నం' సినిమా దాదాపు తన థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంటుంది.