2009 ఎన్నికల్లో ఘోరప్రమాదం నుంచి తప్పించుకోవడానికి కారణం, తమ ఇలవేల్పు ఆంజనేయస్వామి కావడంతో జగిత్యాలజిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామిని దర్శించుకుని పవన్ నాలుగురోజుల పాటు తెలంగాణలోని నాలుగు జిల్లాలలో పర్యటించి, ఆ నాలుగు జిల్లాలలోని జనసేన కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇక కొండగట్టులో ఆయన తన పర్యటన పూర్తి వివరాలను చెప్పనున్నాడు. వీలుంటే పాద యాత్ర, లేదా బస్సు యాత్ర,లేదా రోడ్‌షోలలో ఏది అవసరమో దాని ద్వారానే ఆయన తన పర్యటనను కొనసాగిస్తాడు. ప్రత్యేకమైన విరామం అంటూ ఏదీ ఉండదని పవన్ స్పష్టం చేశాడు. వీలున్న విధంగా ప్రజల వద్దకు వెళ్లడమే తన లక్ష్యమని, దీని ద్వారా ప్రజల సాధకబాధకాలను దగ్గర నుంచి చూసి, అవగాహన చేసుకునే అవకాశం ఉందని పవన్ చెప్పాడు.
యాత్ర చేస్తే ఎక్కువ మంది జనాలను కలుసుకోవడానికి బాగుంటుందని, యాత్ర సందర్భంగా ఎక్కడికక్కడ జనసేన కార్యకర్తలతో సమావేశమవుతానని ఆయన చెబుతున్నాడు. ఇక సర్వమత ప్రార్ధనలు చేసి ఈ యాత్ర చేస్తానని చెప్పిన పవన్ తన భార్య అన్నా లెజినోవాతో ఆదివారం ఉదయం సికింద్రాబాద్‌లని ఓ చర్చిలో ప్రార్ధనలు నిర్వహించాడు. ఈ సందర్భంగా పవన్‌ని తమ కెమెరాలలో బంధించాలని పలువురుపోటీ పడినా పవన్‌వారికి అడ్డుచెప్పలేదు. ఇలా చర్చిలో ఆయన ఏసుక్రీస్తు ప్రార్ధనలు చేసి ఆశీర్వాదం అందుకున్నాడు. ఎలాగూ కొండగట్టులో ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నాడు. ఇక మిగిలింది ముస్లింలకు చెందిన మసీదు మాత్రమే. మరి ఆయన ఏ మసీదుని సందర్శిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.