బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత రాజమౌళి ఎటువంటి సినిమా తీస్తాడు అనుకుంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ తో మల్టీస్టారర్ తీస్తున్నాడు. ఈ సినిమాకు డి.వి.వి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ రెమ్యునరేషన్ తీసుకోకుండా నటిస్తున్నారట.
వీరిద్దరే కాదు వీరిని డైరెక్ట్ చేస్తున్న జక్కన్న కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా సినిమా చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. అయితే కేవలం ప్రాఫిట్స్ లో షేర్స్ మాత్రమే తీసుకుంటారట వీళ్ళు. అయితే ఈ రకంగా చూస్కుంటే ప్రొడ్యూసర్స్, బయ్యర్లకు లాభమే కలుగుతుంది. ఈ మూవీ కేవలం 40 కోట్ల బడ్జెట్ తో మాత్రమే తీస్తాడట. అది కూడా చాలా తక్కువ టైంలో.
ఈ మల్టీస్టారర్ కు జక్కన్న 'ఇద్దరూ ఇద్దరే' అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ మూవీతో రాజమౌళి ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.