'పద్మావతి' చిత్రాన్ని 'పద్మావత్'గా పేరు మార్చి విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సీబీఎఫ్‌సి 'ఘూమర్' పాటలో రాణి పద్మావతిపై తీసిన నడుంని చూపించే సీన్‌ని తీసివేయడం, సతీ ఆచారం ప్రాముఖ్యతను తగ్గించడం, 'పద్మావతి' పేరుని 'పద్మావత్'గా మార్చడం వంటి అన్ని కండీషన్లకు చిత్రం యూనిట్ ఓకే చెప్పింది. ఇక ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌నే గాక 'ఘూమర్' పాటలోని అందాల నడుము చూపించే సీన్‌ని తొలగిస్తే రాజస్థానీ ఘూమర్‌గా చేసిన కొరియోగ్రఫీ దెబ్బతింటుందని, కాబట్టి నడుము సీన్‌ని గ్రాఫిక్స్‌లో కప్పివేస్తామని టీం సీబీఎఫ్‌సిని కోరింది. దానికి ఓకే చెప్పడంతో ఈ పాటలో దీపికాపడుకొనే నడుముని చీరతో కప్పివేస్తూ చేసిన గ్రాఫిక్స్‌ను చూసిన వీక్షకులు అద్భుతంగా ఫీలవుతున్నారు.
పాత పాట కూడా యూట్యూబ్‌లో ఉండటంతో రెండింటిని పోల్చి చూసుకుంటే తేడా అసలు కనిపించడం లేదని, ఏది నిజమో, ఏది గ్రాఫిక్స్ మాయాజాలమో తెలియకుండా ఉందని ఈ వీడియోను చూసిన వారు అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని దేశం మొత్తం ఈనెల 25న విడుదల చేయాలని భావించడంతో ఆ రోజున విడుదల కానున్న అక్షయ్‌కుమార్ 'ప్యాడ్‌మెన్' చిత్రాన్ని రెండు వారాల లేటుగా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.
దీంతో ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల కావాల్సిన రకుల్‌ప్రీత్‌సింగ్ నటించిన 'అయ్యారీ' చిత్రం 'పద్మావత్'తో పోటీగా విడుదల కానుంది. ఇక ఈ చిత్రం విడుదల 25వ తేదీ నేపధ్యంలో దేశవ్యాప్త బంద్‌కి రాజపుత్‌సేన, కర్ణిసేనలతో పాటు పలు హిందూ సంస్థలు సమాయత్తమవుతున్నాయి.