రౌద్రపూరితమైన సహజ నటనకు ఆయనే సరిసాటి. ఈయనకు ప్రేమగా ప్రేక్షకులు ఇచ్చిన బిరుదు రెబెల్‌స్టార్. ఇక రెబెల్‌స్టార్ ఇండస్ట్రీకి వచ్చి 50ఏళ్లు పూర్తి కావడం విశేషం. మనిషి చూస్తే అగ్నికుండ..మనసు మాత్రం మంచు కొండ.. అనే వాక్యం ఆయనకే ఖచ్చితంగా సరిపోతుంది.
తాజాగా ఆయన తన పుట్టినరోజు సందర్బంగా మాట్లాడుతూ, సహజంగా నటించాలనే తపన, ప్రేక్షకులు ఆదరాభిమానాలు ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తయింది. త్వరలో ఓ సమావేశాన్ని ఏర్పాటుచేసి అభిమాలను సన్మానించాలని భావిస్తున్నారు. ఇక ప్రభాస్ నిన్నటివరకు పెళ్లి అంటే 'బాహుబలి' తర్వాత అనేవాడు. ఇప్పుడు అడిగితే 'సాహో' తర్వాత అంటున్నాడు. అయినా పెళ్లి విషయంలో ఆయన కాస్త మెత్తబడ్డాడు. వివాహానికి సుముఖంగా ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు.
ఇక రాంగోపాల్ వర్మ తీస్తున్న 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' గురించి మాట్లాడుతూ, దీని విషయం సెన్సార్, ప్రేక్షకులే నిర్ణయిస్తారు. రాంగోపాల్‌వర్మని ఈ విషయంలో ఏమీ తప్పుపట్టలేం. నేడు ప్రతిది ఇంటర్నెట్ వల్ల ప్రేక్షకుల చేతుల్లోకి వచ్చింది. వారు ఇలాంటివి చూస్తూనే ఉన్నారు. ఇక వర్మ తన సినిమా చూడాలని ఏమీ బలవంతం చేయడం లేదు. వర్మని తెలుగు ఖ్యాతిని బాలీవుడ్‌కి తీసుకెళ్లిన దర్శకునిగా చూడాలనేది నా అభిప్రాయం అని కుండ బద్దలు కొట్టాడు. ఇక ప్రభాస్ నటించే చిత్రానికి సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు.