Advertisementt

అఖిల్ నెక్స్ట్ ఏంటి..?

Mon 22nd Jan 2018 12:26 AM
nagarjuna,akhil,hello movie,akhil 3rd movie  అఖిల్ నెక్స్ట్ ఏంటి..?
What is Akhil Next Movie? అఖిల్ నెక్స్ట్ ఏంటి..?
Advertisement

ఏ స్టార్ హీరో కొడుకైనా మొదటి హిట్ వస్తే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ నాగార్జున తనయుడు అఖిల్ కు మాత్రం ఇంతవరకు హిట్ లేదు. మొదటి సినిమా 'అఖిల్' నెగటివ్ టాకే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా డిజాస్టర్ అయింది. తర్వాత వచ్చిన 'హలో' సినిమా పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ అంతగా రాబట్టలేకపోయింది.

మరి అఖిల్ తన మూడో సినిమా ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 'హలో' ప్రొమోషన్స్ లో ఉన్నపుడు అఖిల్ తన నెక్స్ట్ సినిమా డీటెయిల్స్ జనవరి 10న చెబుతా అన్నాడు. కానీ చెప్పిన డేట్ అయిపోయింది. అలానే సంక్రాంతి కూడా అయిపోయింది. కానీ ఇంతవరకు తన నెక్స్ట్ సినిమా పై క్లారిటీ ఇవ్వలేదు అఖిల్.

నాగ్ మాత్రం కలెక్షన్స్ పరంగా అలాగే టాక్ పరంగా పర్ఫెక్ట్ హిట్టు అందుకోవాలని పెద్ద దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు పెద్ద డైరెక్టర్స్ నాగ్ కు కథ చెప్పి మెప్పించినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజం అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

What is Akhil Next Movie?:

Nagarjuna Plans Akhil 3rd Movie with Star Director

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement