పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. వీరిలో ఎవరు తక్కువ కాదు. ఎవరి టాలెంట్ బట్టి వాళ్ళు టాలీవుడ్ లో స్టార్స్ గా నిలదొక్కుకున్నారు. మార్కెట్ విషయంలో అయినా ఎవరికి ఎవరు తీసిపోరు. పవన్ కళ్యాణ్ గత రెండేళ్ల నుండి చేసిన రెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. మహేష్ బాబు చివరి ఐదు సినిమాలు దారుణమైన నష్టాలు మిగిల్చాయి. స్పైడర్ కూడా దాదాపు 60 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.
రెండు మూడేళ్ల కిందటి వరకు ఏదైనా పెద్ద సినిమా డిజాస్టర్ అయితే 20 - 30 కోట్ల నష్టం ఉండేది. కానీ ఇప్పుడు ఆ నష్టం కాస్తా 50 - 60 కోట్లకు మధ్య చేరిపోవడమే విడ్డూరం. దీనికి కారణం ప్రొడ్యూసర్స్ సినిమాను మితిమీరిన రేట్లకు అమ్మడం అలా ఎందుకు అమ్ముతున్నారంటే... బడ్జెట్ పెరిగిపోవటం వల్లే అని అంటున్నారు. పారితోషికాలు పెరిగపోవడంతోనే సమస్య వస్తోంది. తమ మార్కెట్ పరిధి పెరిగిందని చెప్పుకుంటూ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా హీరోలు పారితోషికం పెంచుకుంటూ వెళ్లిపోతున్నారు. పవన్.. మహేష్ మినిమం ఒక్కో సినిమాకు 25 కోట్ల దాకా పుచ్చుకుంటున్నట్లు వినికిడి.
ఇక పెద్ద స్టార్స్ సినిమా చేస్తున్నారు అంటే అందులో పని చేసేది లెవెల్ టెక్నీషియన్లు.. నటీనటులే ఉంటారు. అలా అందరి పారితోషికాలూ కలిపి 70 కోట్లు దాటిపోతోంది. 100 కోట్లు సినిమా అంటే.. అందులో ప్రొడక్షన్ కోసం పెడుతున్నది 25 నుండి 30 శాతమే. మిగతా అంత పారితోషకాలకే పోతోంది. టాక్ పాజిటివ్ గా ఉండి ఎంత మంచి వసూళ్లు సాధించినా లాభాలు 25 శాతానికి మించట్లేదు. కానీ టాక్ తేడా వస్తే మాత్రం నష్టాలు సగానికి సగం ఉంటున్నాయి. మరి ఈ తంతు ఎన్నాళ్లు సాగుతుందో అనేది ఇప్పుడు పెద్ద సమస్యై కూర్చుంది.