ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం మన దేశంపై బాగానే ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా మన రెగ్యులర్ లైఫ్ లో ఓ భాగం అయ్యిపోయింది. చిన్న నుండి పెద్ద వరకు అందరు దీన్ని విచ్చలవిడిగా వాడుతున్నారు. ఈ రోజుల్లో సోషల్ మీడియాని ప్రతి ఒక్క రంగంలోను వాడేస్తున్నారు. ఆఖరికి పోలీసులు కూడా ఇందులో ప్రవేశించి ఓ విధంగా కౌన్సెలింగ్ ఇస్తున్నారని చెప్పాలి.
అంతే కాకుండా ఎటువంటి సమస్యలు వచ్చిన అవి వారి ముందు ఉంచితే వెంటనే సాల్వ్ చేస్తున్నారు పోలీస్ వారు. ట్రాఫిక్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా సోషల్ మీడియాని చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి అంటూ బాలకృష్ణ లెజెండ్ లో చెప్పిన డైలాగ్ తో పోలీస్ వారు వారి స్టైల్ లో చెబుతున్నారు.
ప్లేస్ మారితే నెంబర్ ప్లేట్ మారుతుంది. ట్రాఫిక్ మారుతుంది. కానీ సేఫ్టీ ఎందుకు మారదు సర్ అంటూ ఉన్న ఆ ట్రాల్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. బాలయ్య చెప్పిన ఆ డైలాగ్ అనువాదంగా చాలా ట్రాల్స్ వచ్చాయి. కానీ అందులో ఇదే బెస్ట్ అని ఎవరికి వారు తోచినట్టుగా కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోని షేర్ చేస్తున్నారు.