ఒకప్పుడు బడా ప్రొడ్యూసర్ గా వెలుగొందిన బెల్లంకొండ సురేష్ ప్రస్తుతం తన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ ని స్టార్ హీరోని చేసే పనిలో ఫుల్ బిజీగా వున్నాడు. అందులో భాగంగానే శ్రీనివాస్ పక్కన స్టార్ హీరోయిన్స్ నే సెలెక్ట్ చేస్తూ మొదటినుండి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు సురేష్. మరి టాప్ రేంజ్ ఉన్న హీరోయిన్స్ పక్కన నటిస్తే ఒక హీరో టాప్ హీరో అవుతాడా? ఆ విషయంలో క్లారిటీ లేకపోయినా కూడా సురేష్ మాత్రం తన కొడుకు సినిమా మొదలవ్వడం పాపం ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్స్ ని తీసుకొచ్చి యాక్ట్ చేపిస్తున్నాడు. అలాగే శ్రీనివాస్ మొదటి సినిమాకి ఏకంగా సమంతని తీసుకొస్తే రెండో సినిమాలో సోనారికకు, మూడో సినిమాకి టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ సురేష్ తాజాగా సాక్ష్యం కోసం డీజే భామ పూజని తీసుకొచ్చాడు.
ఇక ఇప్పుడు కొత్తగా బెల్లంకొండ సురేష్ తన కొడుకు శ్రీనివాస్ తదుపరి చిత్రం కోసం ఇప్పుడు మరో టాప్ హీరోయిన్ ని పట్టేపనిలో ఉన్నాడు. బెల్లకొండ శ్రీనివాస్.. శ్రీవాస్ చిత్రం కంప్లీట్ కాగానే రాజుగారి గది సీరీస్ తో హిట్ డైరెక్టర్ అయిన ఓంకార్ డైరెక్షన్ లో నటించబోతున్నాడు. అయితే పూర్తి స్థాయి క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం టాప్ లెవల్లో ఉన్న కీర్తి సురేష్ ని తీసుకోబోతున్నారనే టాక్ వినబడుతుంది. ఇప్పటికే కీర్తి సురేష్ తో చిత్ర బృందం చర్చలు జరిపినట్లుగా కూడా వార్తలొస్తున్నాయి.
దర్శకుడు ఓంకార్ కీర్తిని స్టోరీ లైన్ చెప్పడమే కాకుండా ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించాడనే టాక్ నడుస్తుంది. మరి సమంత, రకుల్, పూజల కోసం కోట్లు గుమ్మరించిన బెల్లంకొండ సురేష్ ఇప్పుడు తన కొడుకు శ్రీనివాస్ పక్కన నటించబోయే హీరోయిన్ కీర్తి సురేష్ కోసం ఎన్ని కోట్లు గుమ్మరిస్తాడో చూద్దాం. ఏది ఎలాగున్నా శ్రీనివాస్ కోసం సురేష్ మాత్రం ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్స్ ఎవ్వరిని వదలడంలేదు.