గ్లామర్ రోల్స్ అయినా.... హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ అయినా కరెక్ట్ గా సూటయ్యేది ఎవరంటే కచ్చితంగా గుర్తొచ్చేది అనుష్కనే. బాహుబలి లాంటి సినిమాలో అనుష్క అభినయంతో అదరగొట్టేసింది. సైజ్ జీరో సినిమాలో క్యారెక్టర్ కోసం బరువు పెరిగి మునుపటి అందం పోగొట్టుకుంది. దీంతో అందరూ ఇంక పాత స్వీటీ ని చూడలేమేమో అనుకున్నారు.
కానీ తర్వాత వచ్చిన భాగమతి సినిమాతో తనను విమర్శించినా వాళ్లందరికీ మొహం మీద కొట్టినట్టు తయారైంది. ఈ సినిమాకు పిల్ల జమిందార్ ఫేం జి.అశోక్ డైరెక్టర్. ఇది హర్రర్ అండ్ థ్రిల్లర్ జోనర్ లో వస్తుంది. తాజాగా జరిగిన ఈ సినిమా తమిళ్ వెర్షన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన అనుష్క స్లిమ్మయి సుందరంగా కనిపించడం.. సినిమా జనాల దృష్టిని బాగానే ఆకర్షించింది.
మొహంలో కూడా కాస్త మునుపటి కళ కనిపించడం ఆమె అభిమానులకు బాగా హుషారు కలిగించింది. సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క తన లుక్ పై నెగిటివ్ కామెంట్లు రావడంతో పబ్లిక్ ఫంక్షన్లలో కనిపించలేదు.దాదాపు ఆరునెలల పాటు వర్కవుట్లు.. యోగాసనాలు అవీ చేసి మొత్తానికి సన్నబడగలిగింది. దీనికోసం అనుష్క పడిన కష్టాన్ని మెచ్చుకోకుండా ఉండలేము. ఇక ఆమె ప్రధాన పాత్రలో నటించిన భాగమతి ఈనెల 26న తెలుగుతో పాటు తమిళం.. మళయాళం కూడా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.