Advertisementt

చరణ్ లేకుండానే బోయపాటి సినిమా స్టార్ట్!

Fri 19th Jan 2018 07:54 PM
boyapati,ram charan,movie,first day,shoot,boyapati,action begin  చరణ్ లేకుండానే బోయపాటి సినిమా స్టార్ట్!
Boyapati, Ramcharan Film First Day Shoot చరణ్ లేకుండానే బోయపాటి సినిమా స్టార్ట్!
Advertisement
Ads by CJ

మెగా పవర్ స్టార్ గత కొన్ని సినిమాల నుండి కొత్తగా ట్రై చేస్తున్నాడు.  మాస్ సినిమాలకు దూరంగా వెళ్లి డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు. ధృవ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో 'రంగస్థలం' సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చెర్రీ ఎటువంటి సినిమా తీస్తాడో అని అందరికీ ఆసక్తిగానే ఉంది. అయితే మనోడు మాత్రం.. మాంచి మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ చేయాలని ఫిక్సయ్యాడు. 

మాస్ సినిమాలు తీయడంలో పెట్టింది పేరు అయిన బోయపాటితో తన నెక్స్ట్ సినిమా చేయనున్నాడు చెర్రీ. ఈ సినిమాలో 'భరత్ అనే నేను'లో మహేష్ బాబు సరసన నటిస్తున్న కైరా అద్వాని... రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. ఈరోజు (జనవరి 19) ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న వనదేవత టెంపుల్ దగ్గర ఈ సినిమాకు ముహూర్తం షాట్ తో అధికారికంగా మొదలెట్టేశారు.

ఇక ఈ సినిమాకి రిషి పంజాబి సినిమాటోగ్రాఫీగా పనిచేస్తున్నారు. ఈ సినిమాకి మొదట మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ అనుకున్నారుగాని.. బోయపాటి దేవిని ప్రిఫర్ చేయగా అందుకు చెర్రీ కూడా ఒకే చెప్పటంతో దేవి శ్రీ ప్రసాద్ ని బోయపాటి - చెర్రీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేశారు. ఇకపోతే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను హీరో లేకుండానే తీసేసి.. రెండో షెడ్యూల్ లో హీరోతో కలసి వర్క్ చేస్తాడట దర్శకుడు బోయపాటి శ్రీను. 

Boyapati, Ramcharan Film First Day Shoot:

Boyapati Action Begins For Charan!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ