ఈ సంక్రాంతికి అటు తమిళ్ లో ఇటు తెలుగులో ఒకేసారి రిలీజ్ అయిన సినిమా 'గ్యాంగ్'. తమిళ్ లో ఈ సినిమాకు మంచి టాకే వచ్చింది. తెలుగులో యావరేజ్ టాక్ దక్కించుకుంది. అయితే వసూల్ విషయంలో మాత్రం 'గ్యాంగ్' సినిమా అంతగా లేకపోవడంతో ఆశ్చర్యం కలిగిస్తుంది.
వాస్తవానికి తెలుగులో సూర్యకు మంచి మార్కెటే ఉంది. తెలుగులో రజిని తర్వాత అంతటి మార్కెట్ సూర్యకే ఉంది. కానీ రీసెంట్ గా విడుదల అయిన 'గ్యాంగ్' తొలిరోజు వచ్చిన షేర్ వసూళ్లు పట్టుమని కోటి రూపాయలు కూడా లేకపోవడం ఆశ్యర్యం కలిగిస్తుంది. ఇందుకు కారణం తాను పోషిస్తున్న పాత్రలే అంట. కార్తీ..విజయ్...ధనుష్ తెలుగులో మార్కెట్ ను అంతకంతకు పెంచుకుంటున్న వైనం కనిపిస్తుంది.
కానీ సూర్య మాత్రం టాలీవుడ్ మార్కెట్ పతనం అవుతూనే ఉంది. మనవాళ్లు ప్రయోగాలను ఇష్టపడతారు కానీ..హీరో స్థాయి వున్న సూర్య తండ్రి పాత్రలు..విలన్ పాత్రలు..పోషించేసి తెగ ఆశ్చర్యపరచాలని ప్రయత్నిస్తుంటాడు. ఇలా చిత్రవిచిత్రమైన వేషాలతో ఉన్న మార్కెట్ ను పోగొట్టుకున్నాడని.. మనవాళ్లను ఆకట్టుకోలేకపోయాడని అంటున్నారు జనాలు.