'నేను శైలజ, నేను లోకల్' సినిమాలతో ఇండస్ట్రీలో హిట్ హీరోయిన్ గా అతుక్కుపోయిన కీర్తి సురేష్ పక్క రాష్ట్రమైన కోలీవుడ్ లో కూడా టాప్ గేర్ లో దూసుకుపోతూ టాప్ హీరోయిన్స్ గుండెల్లో దడపుట్టించింది. రెండు సినిమాల హిట్ తోనే పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసి ఔరా అనిపించిన కీర్తి సురేష్ కి ఆ సినిమా మాములుగా షాక్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన 'అజ్ఞాతవాసి' సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుందో అందరికి తెలిసిందే. జనవరి 10 న విడుదలైన ఈ 'అజ్ఞాతవాసి' మొదటి షో మొదటి ఆట నుండే నెగిటివ్ టాక్ తో రన్ అవుతుంది. పవన్ వంటి ఫాలోయింగ్ ఉన్న హీరోగాని.. దర్శకుడు త్రివిక్రమ్ మ్యాజిక్ గాని ఈ సినిమాని నిలబెట్టలేక చతికిల పడింది.
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ పాత్రకు ఈ సినిమాలో ఎటువంటి ప్రాధాన్యత లేదనే విషయం సినిమా చూసిన ప్రతిఒక్కరికి తెలుస్తుంది. ఈ సినిమాలో కీర్తి లాంటి నాచురల్ బ్యూటీకి అతిగా మేకప్ వెయ్యడమే కాదు.. ఆమె పాత్రకు అనవసర ప్రాధాన్యం ఇచ్చారా అనిపిస్తుంది కూడా. కేవలం పవన్ ని కవ్వించడం, కొట్టడం తప్ప మరే ప్రాధాన్యత ఉండదు. మరి 'నేను శైలజ, నేను లోకల్' సినిమాల్లో కీర్తి చేసిన పాత్రలు సినిమా మొత్తం హీరోయిన్ చుట్టూనే తిరుగుతాయి. హీరోలకు ఈ సినిమాలో ఎంత ప్రాధాన్యత ఉందో.. హీరోయిన్ కీర్తి పాత్రకు అంతే ప్రాధాన్యత ఉంది. కానీ 'అజ్ఞాతవాసి' సినిమాలో కీర్తి ఇలా అస్సలు ప్రాధాన్యత లేని పాత్ర ఎందుకు చేసిందో ఆమెకే తెలియాలి.
అయితే ప్రస్తుతం కీర్తి సురేష్ కి 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత సావిత్రి బయోపిక్ 'మహానటి' ప్రాజెక్ట్ తప్ప మరేది లేదు. మరి కీర్తి సురేష్ నటించిన కోలీవుడ్ మూవీ 'గ్యాంగ్' కూడా తెలుగులో సూపర్ హిట్ అవ్వలేదు. ఆ సినిమా కూడా సో సో గానే ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి రెండు సినిమాలతోనే లక్కీ హీరోయిన్ అనిపించుకున్న కీర్తి సురేష్ కి 'అజ్ఞాతవాసి' సినిమా మాత్రం గట్టిగా దెబ్బేసింది.