దేశం కోసం ప్రాణాలు అర్పించేవారు. పరిశోధనలతో ప్రజల అవసరాలను తీర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తూ, తమ జీవితాలను ఫణంగా పెట్టే శాస్త్రవేత్తలు, రైతులే నిజమైన హీరోలు. కానీ తెరపై కనిపించే వారు మాత్రం కేవలం రీల్ హీరోలే గానీ రియల్ హీరోలు కాదు. ఇక విషయానికి వస్తే ఇటీవల తాను నటించిన 'టాయిలెట్' ( ఏక్ ప్రేమ్‌కథా) చిత్రం ఎన్నోప్రశంసలు దక్కించుకోవడంతో పాటు బిల్‌గేట్స్‌కి ఫేవరేట్ మూవీ అయింది. అలాంటి హీరో అక్షయ్‌కుమార్ ఈనెల 25 'ప్యాడ్‌మెన్'గా రానున్నాడు.
టాయిలెట్ ద్వారా సమస్యను మనసులకు హత్తుకునేలా చెప్పిన అక్షయ్‌కుమార్ మహిళలకు ప్రకృతి సిద్దంగా వచ్చే పీరియడ్స్‌పై కథాంశంగా 'ప్యాడ్‌మెన్'తో వస్తున్నాడు. అతి తక్కువ ఖర్చుతో శానిటరీ ప్యాడ్ మేకింగ్ మెషిన్ ఆవిష్కర్త అరుణాచలం మురుగనాథం జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఈ చిత్రం యూనిట్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దేశంలోని అరుణాచలం మురుగనాథం వంటి 16 మంది ఆవిష్కర్తలను వేడుకకు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అక్షయ్‌కుమార్ మాట్లాడుతూ, మేమంతా రీల్‌పైన హీరోలం. కానీ రియల్ లైఫ్‌లో మీరే నిజమైన హీరోలు అని వారిపై ప్రశంసలు కురిపించాడు. వీరందరికీ ఈ చిత్రంలోని పాటలను ప్రదర్శించారు. అమిత్ త్రివేది స్వరపరిచిన పాటలను మోహిత్ చౌహాన్ ఆలపించారు. ఈ శాస్త్రవేత్తలందరినీ అభినందిస్తూ అక్షయ్‌కుమార్ వారికి ఐదు లక్షల బహుమతులను అందించాడు. కిందటి ఏడాది 'జాలీ ఎల్‌ఎల్‌బి, నామ్ షబానా, టాయిలెట్' చిత్రాలతో వచ్చిన అక్షయ్ ఈ ఏడాది 'ప్యాడ్‌మెన్, 2.0, గోల్డ్, మొగల్, కేసరి' వంటి చిత్రాలతో రానున్నాడు.