Advertisementt

'ఎన్టీఆర్‌'కి నివాళి భలే ఇచ్చారు..!

Fri 19th Jan 2018 12:36 AM
balakrishna,ntr,ntr biopic poster,teja,balayya,ntr death anniversary  'ఎన్టీఆర్‌'కి నివాళి భలే ఇచ్చారు..!
NTR Biopic First Look Poster Released 'ఎన్టీఆర్‌'కి నివాళి భలే ఇచ్చారు..!
Advertisement
Ads by CJ

స్వర్గీయ ఎన్టీఆర్‌కి సంబంధించి తేజ దర్శకత్వంలో బాలయ్యాస్‌ బయోపిక్‌గా 'ఎన్టీఆర్‌' చిత్రం, వర్మ దర్శకత్వంలో 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్రం, కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో 'లక్ష్మీస్‌ వీరగ్రంధం' వంటి చిత్రాలు ఉంటాయని వారు ప్రకటించారు. కానీ వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌', కేతిరెడ్డి 'లక్ష్మీస్‌ వీరగ్రంధం' చిత్రాల నుంచి వారు డ్రాప్‌ అయ్యారని అందుకే ఎలాంటి అప్‌డేట్స్‌ గానీ, సినిమాకి సంబంధించిన విషయాలను గానీ ప్రస్తావించడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇక ఎన్టీఆర్‌ వర్దంతి సందర్భంగా బాలయ్య మాత్రం తన తండ్రి బయోపిక్‌ ప్రీలుక్‌ పోస్టర్‌ని విడుదల చేశాడు. 

ఇందులో 'ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయంగా భావించిన ఓ మహానుభాహుడికి ఇదే నివాళి' అని ప్రింట్‌ చేశారు. ఇక నాటి చైతన్యరథం మీద ఉన్న ఎన్టీఆర్‌ని పోలిన లుక్‌ని రివీల్‌ చేశారు. ఇక టైటిల్‌గా నాటి ఎన్టీఆర్‌ సంతకాన్ని పోలి ఉండేలా తెలుగులో 'యన్‌.టి.ఆర్‌' అని, బ్యాగ్రౌండ్‌లో ఇంగ్లీషు లెటర్స్‌తో ఎన్‌టిఆర్‌ని డిజైన్‌ చేసిన ఈ లుక్‌ బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని బాలయ్యతో పాటు సాయికొర్రపాటి, విష్ణు ఇందూరిలు నిర్మిస్తుండగా, తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందించనున్నాడు. మొత్తానికి నాటి ఎన్టీఆర్‌ బయోపిక్‌ని తీయడం సంతోషించదగ్గ విషయమే. 

ఇక ప్రస్తుతం బాలయ్య నటించగా, సంక్రాంతి కానుకగా విడుదలైన 'జైసింహా' చిత్రం బిసీ సెంటర్స్‌లో మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఇక ఎన్టీఆర్‌ వర్దంతి రోజున ఈ చిత్రం టీజర్‌ని రిలీజ్‌ చేస్తారని, దానికి సంబంధించిన షూటింగ్‌ హైదరాబాద్‌లో ఉన్న రామకృష్ణాస్టూడియోస్‌లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అయితే అనివార్య కారణాల వల్ల టీజర్‌ని కాకుండా కేవలం ప్రీలుక్‌ని మాత్రమే రిలీజ్‌ చేస్తున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. 

NTR Biopic First Look Poster Released:

Balakrishna Revealed NTR Biopic Poster on the Occasion Of NTR Death Anniversary

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ