ఓవైపు పవన్ ఫ్యాన్స్, కత్తి మహేష్‌ల వివాదం ఇప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. కత్తి మహేష్‌కి బిసి, దళిత, ఇతర ప్రజాస్వామ్య సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. మరోవైపు రాంగోపాల్‌వర్మ కూడా కత్తికి మద్దతు పలికాడు. ఇదే సమయంలో పూనమ్‌కౌర్, నిర్మాత రాంకీ వంటి వారు పవన్‌కి మద్దతు తెలుపుతున్నారు.
తాజాగా ఈ విషయమై నిర్మాత రాంకీ మాట్లాడుతూ, కత్తి మహేష్‌కి మాటలు తప్ప ఇంకేమీ రావు. ఆయనకు దర్శకత్వంపై కూడా ఏమాత్రం అవగాహన లేదు. కత్తిమహేష్‌ని నాకు మోహన్‌రావిపాటి అనే నిర్మాత పరిచయం చేశాడు. కత్తికి మాటలు మాట్లాడటంలో నైపుణ్యం ఉంది. సినీ ఇండస్ట్రీకి కత్తి చీడపురుగు. అమ్మాయిలకు కత్తి మహేష్ అసభ్యమైన మెసేజ్‌లు పెట్టేవాడు. ఆయన స్త్రీలోలుడు. ఆయనకు డైరెక్షన్ గురించి, సినిమాల గురించి ఏమీ తెలియదు. కత్తి మహేష్‌కి సంబంధించిన పలు సంచనాలను నేను బయటపెడతాను. అప్పటివరకు పవన్ అభిమానులు కాస్త సంయమనం పాటించాలి అని తెలిపాడు.
మరోవైపు తనకి సంబంధించిన వ్యక్తిగత విషయాల జోలికి వస్తే తాను కూడా పవన్ వ్యవహారాలు, ఆయన వ్యక్తిగత విషయాలు, ఇతర లింకులు కూడా బయటపెడతానని కత్తి మహేష్ హెచ్చరిస్తున్నాడు. మొత్తానికి ఈ వ్యవహారం వృత్తిగత విషయాల నుంచి వ్యక్తిగత విషయాల దాకా వ్యాపించింది. మరోవైపు కొందరు ఫేస్‌బుక్‌లో పవన్ అభిమానులు చేస్తున్న పలు విధ్వంసపూరిత పనులను వీడియోలు తీసి పోస్ట్ చేస్తూ, మిత్రపక్షంగా ఉంటేనే ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మరి అధికారంలోకి వస్తే ఇంకెంత దారుణంగా బిహేవ్ చేస్తారో? అని వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తానికి చిన్నగా రాంకీ పుణ్యమా అని రాంకీ కత్తిమహేష్‌ని స్త్రీలోలుడు అంటూ ఉంటే కత్తి కూడా పవన్‌కి సంబంధించిన, ఆయన మొదటి భార్య నందినికి సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నాడని సమాచారం.