తమ కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త గ్లామర్ విషయంలో ఆచితూచి అడుగు వేసే వారు కూడా తదుపరి సినిమా డిమాండ్ చేసిందనో, మరోటో వంకతో గ్లామర్‌షోలు, స్కిన్‌షోలకి, లిప్‌లాక్‌లకి కూడా గేట్లు ఎత్తివేస్తారు. ఇక ఒక నటీనటులు ఏ చిత్రంలో నటించాలి? దేనికి నో చెప్పాలి? అనేది వారి వ్యక్తిగత విషయం. ఇందులో ఎవరూ బలవంతం చేయలేరు. ఇక తాజాగా 'ప్రేమమ్'తో మలయాళంతో పాటు దేశవ్యాప్త గుర్తింపును తెచ్చుకున్న సాయిపల్లవి 'ఫిదా'లో ఇగో ఉన్న 'భాన్సువాడ భానుమతి'గా పెంకిపిల్లగా అలరించింది. ఇక ఈమె నానితో చేసిన 'ఎంసీఏ'తో కూడా మంచి మార్కులే సంపాదించింది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఆమెకి, నానికి గొడవలు వచ్చాయనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని నాని క్లారిటీ ఇచ్చాడు. 'ఫిదా' మూవీలోలాగానే సాయిపల్లవికి నిజజీవితంలో కూడా ఇగో ఎక్కువనే ప్రచారం జరుగుతోంది. దీనిపై సాయి పల్లవి స్పందించింది.
అందరు హీరోలు, హీరోయిన్లు దిల్‌రాజుతో సినిమా అంటే ఎగిరి గంతేయవచ్చు. కానీ దిల్‌రాజు గారి కథ నాకు నచ్చలేదు.. అని కుండ బద్దలు కొట్టింది. ప్రతి ఒక్కరు వచ్చి ఫలానా హీరోతో నటిస్తావా? అని అడుగుతున్నారని, తన దృష్టిలో కథే హీరో అని, తనకు ప్రత్యేకంగా హీరోలంటూ ఎవ్వరూలేరని చెప్పుకొచ్చింది. ఇక సాయిపల్లవికి దిల్‌రాజు తక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం వల్లే నో చెప్పిందని కొందరు, పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా నో చెప్పిందని మరికొందరు అంటున్నారని, ఎవరేమనుకున్నా కూడా నా నిర్ణయంలో మార్పు లేదంటోంది. మణిరత్నం గారి చిత్రాలలో ప్రతి ఒక్కరూ చేయాలనుకుంటారు. కానీ మణిరత్నం గారు చెప్పిన కథకు నేను న్యాయం చేయలేనని వదిలేశాను. విలక్షణ నటుడు విక్రమ్ సరసన కూడా నో చెప్పాను.
విక్రమ్ చిత్రం అంటే బలమైన హీరోయిన్ పాత్ర ఉండాలి. కానీ ఆ కథలో ఆ పాత్ర తేలిపోవడం ఖాయమని ముందుగానే ఆలోచించి నో చెప్పాను. ఇక కొందరు గ్లామర్‌షో అంటారు. గ్లామర్ అంటే అందాల ఆరబోత మాత్రమే కాదు. నాకు మొటిమలు ఉన్నా కూడా నేను గ్లామర్‌గానే ఉంటాను. నా తల్లితండ్రులు స్కిన్‌షో, లిప్‌లాక్స్ వంటివి చేయవద్దని చెప్పి సినిమాలకు ఓకే చెప్పారు. వారికిచ్చిన మాటలను నేను నిలబెట్టాలి. ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా ఏ పాత్రంటే ఆ పాత్ర నేను చేయనని తేల్చేసింది...!