Advertisementt

ఆ సీన్లు, ఆ దుస్తులు వేయను: నయన..!

Thu 18th Jan 2018 12:44 AM
nayanthara,conditions,balakrishna,jai simha,sign movie  ఆ సీన్లు, ఆ దుస్తులు వేయను: నయన..!
Nayanthara with 3 condition to sign a movie ఆ సీన్లు, ఆ దుస్తులు వేయను: నయన..!
Advertisement
Ads by CJ

తన కెరీర్‌ స్టార్టింగ్‌లో హాట్‌ సీన్స్‌, లిప్‌లాక్‌సీన్స్‌, శింబు, ప్రభుదేవాలతో దిగిన బోల్డ్‌ సీన్స్‌తో పాటు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా కూడా నయనతార ఓ రేంజ్‌లో వార్తల్లో నిలిచింది. ఇక 'బిల్లా' చిత్రంలో తన బికినీ ద్వారా తమిళ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. కానీ సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ వచ్చే కొద్ది అందునా దర్శకుడు విఘ్నేష్‌శివన్‌తో క్లోజ్‌గా ఉంటున్నప్పటి నుంచి ఈమె తనలోని గ్లామర్‌కోణానికి నో చెబుతోంది. మరోవైపు నయన విఘ్నేశ్‌శివన్‌ని ఇప్పటికే రహస్యంగా వివాహం చేసుకుని, సంసారం కూడా సాగిస్తోందని, కానీ హీరోయిన్‌గా మంచి అవకాశాలు ఇంకా వస్తుండటంతో వారు ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచుతున్నారని కూడా కోలీవుడ్‌ మీడియా గట్టిగా వాదిస్తోంది. 

ఇక ఈ మధ్య నయనతార తన చిత్రాల ఎంపిక సమయంలో దర్శకనిర్మాతలకు, హీరోలకు పలు కండీషన్లు పెడుతోంది. ఇప్పటికే నో ప్రమోషన్స్‌ అనే సిద్దాంతాన్ని పాటిస్తున్న ఆమె పొట్టి దుస్తులు, అసహ్యకరమైన భంగిమల్లో డ్యాన్స్‌లు, గ్లామర్‌షోలతో పాటు హీరోలు తనకు ఎక్కడా ముట్టుకోకూడదని కూడా కండీషన్స్‌ పెడుతోందని వార్తలు వస్తున్నాయి. తాజాగా విడుదలైన బాలకృష్ణ 'జై సింహా' చిత్రం చూస్తే ఇది నిజమేనని తేలుతోంది. ఇందులో బాలయ్య ఆమె చేతిని కాదు కదా.. చిటికిన వేలుని కూడా ఎక్కడా తాకలేదు. సాధారణంగా బాలయ్య చిత్రాలలో కాస్త హీరోయిన్స్‌ విషయంలో ఆయన శృంగారప్రియుడిగా కనిపిస్తాడు. 

కానీ ఈ చిత్రంలో ఆ ఛాన్స్‌ని నయన ఇవ్వలేదు. 'సై..రా' చిత్రం కోసం కూడా ఆమె ఇవే కండీషన్లు అప్లై అంటోందిట. దీంతో ఆమె నటించే చిత్రాలలో గ్లామర్‌ యాంగిల్‌ మిస్‌ అవుతోంది. ఆలోటును పూరించడానికి మరో ఇద్దరు హీరోయిన్ల సాయం తీసుకున్నారు. మొత్తానికి నయన కావాలంటే ఆమె చెప్పిన కండీషన్లకు ఒప్పుకోక తప్పదట...! 

Nayanthara with 3 condition to sign a movie:

Nayanthara Conditions For Balakrishna Jai Simha Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ