సంక్రాంతికి మహేష్‌బాబు నటిస్తున్న కొరటాల శివ చిత్రం ఫస్ట్‌లుక్ వస్తుందని భావించారు. కానీ 'రంగస్థలం 1985' తరహాలోనే ఈ 'భరత్ అనే నేను' యూనిట్ నుంచి కూడా అదే విధమైన ప్రకటన వచ్చింది. హ్యాట్రిక్స్ హిట్స్‌తో ఊపు మీదున్న కొరటాల శివ దర్శకత్వంలో వరుసగా రెండు డిజాస్టర్స్‌తో సతమతమవుతున్న మహేష్‌బాబు హీరోగా, ప్రస్తుతం మహేష్-కొరటాల శివ చిత్రంతో పాటు త్వరలో రామ్‌చరణ్-బోయపాటి శ్రీను, రాజమౌళి-రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్‌ని కూడా నిర్మించనున్న డివివి దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న 'భరత్ అనే నేను' చిత్రానికి సంబంధించిన టీజర్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇందులో మహేష్ పేరు భరతా? కాదా? అనేది మాత్రం సస్పెన్స్‌లో ఉంచారు. మరోవైపు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం సమయంలో వాడే 'శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల, నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను, శ్రద్దతో, అంత:కరణ శుద్దితో నిర్వహిస్తానని, భయం గానీ, పక్షపాతం గానీ, రాగద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని, దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను' అనే అక్షరాలు కనిపిస్తున్నాయి.
సో..ఇందులో మహేష్‌బాబు తెలంగాణకు కాకుండా ఆంద్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని తెలిసిపోతోంది. దీనిలో ఎక్కడా మహేష్‌బాబు పేరు భరత్ అని కనిపించలేదు. ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతోంది. జవవరి26న రిపబ్లిక్ డే సందర్బంగా మొదటిసారి ప్రమాణస్వీకారం చేయనున్నట్లు స్పష్టమైంది. మరి ఈ చిత్రంలో మహేష్ పేరు భరత్ అవునా? కాదా? టైటిల్ 'భరత్ అనే నేను'యేనా అనేది స్పష్టం కావాలంటే 26వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదల కానుండగా, మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది. దీనికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.