Advertisementt

నందమూరి 'ఎమ్మెల్యే' దూకుడు..!

Wed 17th Jan 2018 01:43 AM
kalyanram,mla,micro,teaser,upendra madhav  నందమూరి  'ఎమ్మెల్యే' దూకుడు..!
MLA Mini Teaser Review నందమూరి 'ఎమ్మెల్యే' దూకుడు..!
Advertisement
Ads by CJ

తన కెరీర్‌లో 'అతనొక్కడే, హరేరామ్‌, పటాస్‌' వంటి మూడు చిత్రాల విజయాలను మాత్రమే కలిగి ఉన్న నందమూరి హీరోకళ్యాణ్‌రామ్‌. ఈయనకు ఇటీవల తన సోదరుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన 'జై లవకుశ' కూడా ఫైనాన్షియల్‌గా ఓకే అనిపించింది. మరోవైపు ఇప్పుడు ఈ హీరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే 'నా నువ్వే'తో ఫస్ట్‌లుక్‌, టీజర్‌తో వచ్చిన ఆయన తాజాగా 'ఎమ్మెల్యే' (మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి)గా రానున్నాడు. ఉపేంద్రమాధవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఓ అమ్మాయి కోసం ఒక కుర్రాడు ఎమ్మెల్యే ఎలా అయ్యాడు? అనేపాయింట్‌ ఆధారంగా రూపొందుతోందని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం టీజర్‌ విడుదలైంది. 

ఇందులో ఎమ్మెల్యేగా తెల్ల డ్రస్‌లో ఉన్న కళ్యాణ్‌రామ్‌ రిక్షాపై ఉండగా, దానిని ఆయన అసిస్టెంట్‌ పృధ్వీ లాక్కురావడం కనిపిస్తోంది. అదే గెటప్‌లో కళ్యాణ్‌రామ్‌ స్టైల్‌గా నడుచుకుంటూ వస్తున్నాడు. మరోవైపు ఆయన అనుచరుడు, అసిస్టెంట్‌గా ఉన్న పృథ్వీ 'తిప్పండి సార్‌ మీసం' అంటే 'తగ్గించాం కదా రాజుగారూ', 'పెట్టండి సార్‌ అద్దాలు' అనే డైలాగ్‌కు 'అదీ' అంటూ కళ్యాణ్‌రామ్‌ నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆయనపై పూలవర్షం కురవడం వరకు ఈ టీజర్‌ బాగా ఆకట్టుకుంటోంది. దీంతో పాటు ఓ యాక్షన్‌ సీన్‌లో కనిపించే సీన్‌ కూడా ఇందులో కట్‌ చేశారు. ఉపేంద్రమాధవ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుండగా, ఇందులో నందమూరి కళ్యాణ్‌రామ్‌ సరసన కాజోల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

ఇక 'నా నువ్వే' చిత్రంలో తమన్నా నటిస్తోంది. మరి ఈ రెండు చిత్రాలలో ముందుగా ఏ చిత్రం విడుదల కానుందో వేచిచూడాల్సివుంది...! మూసచిత్రాల ధోరణి నుంచి ఈ హీరో కాస్త బయటకు వచ్చాడా? అనే ఆసక్తిని మాత్రం ఈ టీజర్‌ బాగా కలిగిస్తోంది. 'వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు మన ఆశాజ్యోతి. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ' అనే వాయిస్‌ ఓవర్‌ కూడా బాగా ఆకట్టుకుంటోంది. మొత్తానికి ఓ కొత్త 'ఎమ్మెల్యే' ఈ చిత్రం ద్వారా రానున్నాడని మాత్రం నమ్మకం కలుగుతోంది. 

CLICK HERE FOR MLA MICRO TEASER

MLA Mini Teaser Review:

MLA Micro Teaser: A Call For Newspapers    

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ