ఓవర్సీస్ లో మొదటి నుంచి అత్యధిక మార్కెట్ కలిగిన తెలుగు హీరో అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు పేరే గుర్తొస్తుంది ఎవరికైనా. 'అతడు'తో ఓవర్సీస్ మార్కెట్ ఓపెన్ చేసి ఒక్కో చిత్రంతో ఆ మార్కెట్ ని విస్తృతంగా వ్యాపించుకుంటూ వచ్చారు మహేష్ బాబు. మెగా ఫ్యామిలీ హీరోలకి తెలుగు రాష్ట్రాలలో క్రేజ్ ఎక్కువగానే ఉన్నప్పటికీ ఓవర్ సీస్ లో వీరి సినిమాలకి గిరాకీ చాలా ఆలస్యంగా ప్రారంభమైన మాట మాత్రం వాస్తవం. అయితే ఇప్పుడు ఈ లెక్కలన్నీ మార్చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం 'అజ్ఞాతవాసి'.
ముందుగా అమెరికా దేశంలోని ప్రీమియర్ షోస్ తోనే విడుదలైన 'అజ్ఞాతవాసి' డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుని రెండవ రోజు నుంచే పేలవమైన వసూళ్లతో నలిగిపోతుంది. కానీ అమెరికాలో మాత్రం ఇతర హీరోల సూపర్ బ్లాక్ బస్టర్ చిత్రాలకి కూడా సాధ్యపడని 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని తొలివారం పూర్తయ్యే సరికి చేరుకొని కొత్త రికార్డు సాధించాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే 'అజ్ఞాతవాసి' చిత్రం కళ్యాణ్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన 'అత్తారింటికి దారేది' చిత్ర అమెరికా దేశంలో క్లోసింగ్ గ్రాస్ ని అధిగమించేసింది.. అంటే 'అజ్ఞాతవాసి' అక్కడివారికి బాగానే ఎక్కేసిందని చెప్పుకోవచ్చు. 2 మిలియన్ డాలర్స్ వసులూ చేసినప్పటికీ.. ఈ చిత్రం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కి లాసే. 4 మిలియన్ డాలర్స్ వస్తేనే ఈ సినిమాని తీసుకున్నవారికి లాభాలు వస్తాయి. లేదంటే.. ఈ రికార్డు వేస్టే.